HomeTelanganaTelangana News: ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana News: ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana News: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana News) అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారిగా నియమించింది.

రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సీఎం ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.

ప్రత్యేకాధికారులుగా నియమించిన వారు వీరే..
* ఆదిలాబాద్, నిర్మల్​, కుమ్రంభీం అసిఫాబాద్​, మంచిర్యాల: కృష్ణ ఆదిత్య
* కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా: ఆర్​వీ కర్ణన్​
* నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట: అనితా రామచంద్రన్
* నిజామాబాద్, కామారెడ్డి: డా. ఏ.శరత్
* రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి: డి.దివ్య
* మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్: రవి
* వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్: టి. వినయ కృష్ణారెడ్డి
* మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట: హరిచందన దాసరి
* ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం: కె.సురేంద్ర మోహన్

దాదాపు 1.5 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుకు 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 4,598 కేంద్రాలను ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి: Foxconn: ఫాక్స్‌కాన్ ను సందర్శించిన సీఎం రేవంత్
Musi river: మూసీ ప్రాంత పేదలకు ప్రత్యామ్నాయం కల్పిస్తాం: రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు