Saraswati Power: మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించిన సరస్వతీ పవర్ కంపెనీ (Saraswati Power) భూములను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్.. (Pawan Kalyan) బాధితులకు అండగా ఉంటామన్నారు.
సరస్వతి పవర్ భూముల పరిశీలన అనంతరం డీసీఎం పవన్ కల్యాణ్ ఏమన్నారో ముఖ్యాంశాలివీ..
* 700 ఎకరాల భూమి మాచవరం మండలం, దాచేపల్లి మండలంలో సరస్వతి పవర్ ప్లాంటు కోసం గత ముఖ్యమంత్రి, వైసీపీ నాయకుడు ఆయన సొంత కంపెనీకి 86 శాతం ఈ సరస్వతి పవర్ ప్లాంటులో (Saraswati Power) ఉంది.
* వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చారు. ఆరోజున ఒకటే మాట ఇచ్చారు. ఇక్కడున్న పిల్లలకు ఉద్యోగాలిస్తాం, భూములు ఇవ్వాలని చెప్పారు.
* మీ ఇంటి సమస్య ఇది. మన రాష్ట్ర ప్రజల సమస్య ఇది. ఇష్టం లేకుండా భూములు అమ్మారు.
* గతంలో పెట్రోలు బాంబులేసి, నాటు బాంబులేసి ఇక్కడ భయపెట్టారు.
* ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నా. మీకు భరోసా ఇవ్వడానికి, మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాం.
* కోడెల శివప్రసాద్ గారిని.. రూపాయి డాక్టర్ అంటారు ఆయన్ను.. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఆయన్ను ఇబ్బంది పెట్టారు.
* రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు వచ్చేసిన ఫర్నీచర్ ను ఎక్కడ పెట్టాలో తెలియక ఆయన ఆఫీసులో పట్టక ఇంట్లో పెట్టి లెటర్ అసెంబ్లీకి రాశారు. నా దగ్గర ఫర్నీచర్ ఉండిపోయింది తీసుకెళ్లండి లేదా డబ్బులు కట్టేస్తానన్నారు. ఆయన్ను వేధించి చంపించేశారు.
* 20 లక్షల ఫర్నిచర్ ను కోడెల చెల్లించలేదని వేధించిన వ్యక్తి.. ఈరోజు సరస్వతి పవర్ ప్లాంట్ అని చెప్పి రైతాంగానికి న్యాయం జరగలేదు. సరైన పరిహారం ఇవ్వలేదు. (Saraswati Power)
* మన వేమవరంలో 710.6 ఎకరాలు, జామాయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, దంగెడ గ్రామంలో 107.36 ఎకరాలు మొత్తం రైతాంగం నుంచి కొన్నది 1184 ఎకరాలు.
* పట్టా భూమి 1083.715 ఎకరాలు, చుక్కల భూమి 77 ఎకరాలు.. ఇందులో ఏ సెంటు భూమి ఎవరిది ఏది అని సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై అధికారులను ఆదేశిస్తే.. ఈరోజుకి 24 ఎకరాల అసైన్డ్ భూమి ఎస్సీ కుటుంబాలకు చెందిన భూమిని వీళ్లు తీసేకున్నారు.
* ఇవన్నీ కాకుండా ఇక్కడున్న పట్టా భూములు ఏవీ ఇష్టంతో అమ్మలేదు. భయపెట్టి తీసుకున్నారు. సగానికి సగం మందిని భయపెట్టి, బాంబులేసి, దాడులు చేసి ఈ భూములు లాక్కున్నారు.
* దీంట్లో అసైన్డ్ ల్యాండ్ 20 ఎకరాలు మన వేమవరంలోనే ఉంది. ఏదన్నా మాట్లాడితే ఫ్యాక్షన్ గొడవలు అంటారు, బాంబులేస్తామంటారు, రౌడీయిజం అంటారు. నిన్న మాట్లాడింది అందుకే. మెత్తగా ఉంటే వీళ్లకు సరిపోదు.
* ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఇలాగే వదిలేస్తే వీళ్లు పేట్రేగి పోతారు. మీకు భరోసా ఇవ్వడానికి, అండగా ఉండటానికి వచ్చాం.
* తీసుకున్న భూమి కాకుండా ఇంకో 350 ఎకరాలు పైచిలుకు ఆ కనిపించే ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారు. ముడి సరుకు కోసం 1100 ఎకరాలు.. ఈరోజు వరకు భయపెట్టి.. ఫ్యాక్టరీ ఇంకా రాలేదు.
* ఇంకా అన్నా చెల్లెలు కొట్టుకుంటున్నారు. మీ పొలాలు దోచేసి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, ఈరోజు అటవీ భూములుగా ఉన్న 400 ఎకరాలు.. ఇది రెవెన్యూ భూములు కింద మార్చేసి వాళ్లు తీసేసుకున్నారు.
* దీనిపై కూడా సమగ్ర విచారణ జరపాలి. కలెక్టర్ గారికి కూడా ఆదేశిస్తున్నా. సంపూర్ణంగా ఎంత భూమి ఉంది, ఎన్ని అవకతవకలు జరిగాయి? ఎంత అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి? పెట్టిన ప్రాజెక్టు ఎందుకు ముందుకెళ్లలేదు?
* దాదాపు 2009లో 30 సంవత్సరాలకు లీజు తీసుకుని.. ఈయన ముఖ్యమంత్రి అయ్యి.. 2019-24కు ఇదే భూముల్ని 50 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు.
* కుంటలు, చెరువులు అన్నీ కలిపి 24.78 ఎకరాలు ఆకుపై చేశారు. కోర్టుల్లో పెట్టి సొంత ఆస్తిలా కొట్టుకుంటున్నారు. ఇది మీ (ప్రజల) ఆస్తి.
* నిజంగా మాట ఇచ్చినట్టుగా ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తే ఇబ్బంది లేదు.
* మన కష్టార్జితం, సహజ వనరులు ఒక్కడి సొంతం కాదు. సహజ వనరులు ఇస్తే తిరిగి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. సహజ వనరులు ఏ ఒక్కడి సొంతం కాదు అవునా..?
* ఇది సిమెంటు ఫ్యాక్టరీ అంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి క్యాప్టివ్ పవర్ అని పవర్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు.
* దీంట్లో సున్నపురాయి, మట్టిని కలిపి దాదాపు 1100 సెంటీగ్రేడ్ నుంచి 1500 సెంటీగ్రేడ్ వరకు రోటరీ బట్టీలో వేడి చేయడం ద్వారా దీంట్లో క్లింకర్ ఉత్పత్తి అవుతుంది.
* దానికి క్లింకర్, జిప్సం కలిపితే గట్టి సిమెంట్ అవుతుంది. ఇది క్యాప్టివ్ పవర్ గా చేసుకోవాలని పవర్ ప్రాజెక్టుగా చేసుకున్నారు.
* దీనికి నేను పర్యావరణ అధికారులను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారిని కూడా అడిగాను. దీనికి పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు, అప్లై చేయలేదన్నారు.
* ప్రతి చోటా తాగడానికి నీళ్లు లేవు. ఇబ్బందులున్నాయి. అలాంటిది ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 196 కోట్ల లీటర్లు అంటే 700 ఎకరాలకు సరిపోయేంత నీళ్లు కృష్ణా జలాల నుంచి తీసుకొచ్చేలా రాసేసుకున్నారు.
* ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకపోయి ఉంటే, జనసేన రాకపోయి ఉంటే మీ భూములకు రక్షణ కల్పించేవారు ఎవరు? కట్టని సిమెంట్ కంపెనీకి 196 కోట్ల లీటర్లు తీసుకున్నారు. దీనిపై విచారణ జరగాలి. రేపు క్యాబినెట్ లో కూడా ప్రస్తావిస్తాను.
* దీంట్లో 86 శాతం గత ప్రభుత్వ ముఖ్యమంత్రిది, ఆయన కుటుంబానిది. ఈరోజుకీ మీకు ఏదైనా మాట్లాడితే మీకు పరిహారం రాలేదంటే, అసైన్డ్ భూములు ఆకుపై అయ్యాయంటే మీపై దాడులు చేస్తున్నారు.
* నేను ఎస్పీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. మీరు ప్రజల మీద బాంబుల దాడులు జరిగితే, వారిని బెదిరించినా, ఏ మాత్రం ఉపేక్షించకండి. ఉపేక్షిస్తే మటుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేం ప్రజలకు అండదండగా ఉండేందుకు వచ్చాం.
* మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. తన తండ్రి వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించిన కంపెనీకి 1184 ఎకరాలు (1083 పట్టా భూమి, 76 ఎకరాలు.. అసైన్డ్ భూమిని కేటాయించుకున్నారు. ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్ ను విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి వీలులేదు.
* గత సీఎం తరచూ క్లాస్ వార్ గురించి మాట్లాడుతుంటారు..కానీ ఇది క్లాస్ వార్ కు సంబంధించిన క్లాసిక్ కేసు. దళిత రైతులకు కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా లాక్కున్నారు. వాటిని మైనింగ్ కోసం లీజుకు తీసుకున్నారు.
* మీరు భూములు ఇవ్వండి.. మీకు డబ్బులు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి భూములు తీసుకున్నారు. కానీ ఈ రోజుకు కూడా వారికేమీ చేయలేదు. డబ్బులు ఇవ్వలేదు,. ఉద్యోగాలు ఇవ్వలేదు.
* సిమెంట్ కంపెనీకి ముడిపదార్థాలు సమకూర్చుకోవడానికి, పవర్ కంపెనీ కోసం ఈ భూములను వాడుకుంటున్నారు.
* జగన్ సీఎం అయ్యాక 196 కోట్ల లీటర్ల కృష్ణా నీటిని తన కంపెనీ కోసం మళ్లించుకున్నారు.
* వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దళితుల భూములను, సహజ వనరులను దోపిడీ చేసిందో దేశం మొత్తానికి తెలిసేలా నేషనల్ మీడియా కృషి చేయాలి.
* దళితులు, పేదలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ అంశంపై హైకోర్టు దృష్టికి తీసుకువెళతాం. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతా. క్యాబెనెట్ లో చర్చిస్తాం.
* ఈ భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయి.. వాటిని గుర్తించి పవర్, సిమెంట్ ప్లాంట్లకు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయడానికి కృషి చేస్తా.
* పోలీసులు మెత్తబడిపోయారు.. లేదా భయపడుతున్నారు. గత ప్రభుత్వం ఇప్పుడున్న యువతని.. అందరినీ భయపెట్టారు.
* రైతులపై పెట్రోల్ బాంబులు వేసి వారిని వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు భయపెట్టారు. అటువంటి వారి నుంచి రైతులను కాపాడాలి.
* ప్రజల ప్రాణాలను కాపాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. రౌడీయిజాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది.
* ఇంకా వైసీపీ నాయకులే ప్రభుత్వంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు.. తోలు తీస్తా.. తొక్క తీస్తా గుర్తు పెట్టుకోండి.
* లాండ్ అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందో చూపిద్దాం ఆయనకి.
ఇవీ చదవండి: Pawan Kalyan: బయటకొస్తే ప్రజలు తిడుతున్నారు.. నేను హోంశాఖ తీసుకుంటే..
Pawan: ‘సరస్వతి పవర్’లో అటవీ భూములపై పవన్ వాకబు
Pawan in Vizianagaram: గుర్లలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికీ రూ.1లక్ష
Pawan at Vizianagaram: విజయనగరంలో పవన్ పర్యటన.. అతిసార బాధితులకు పరామర్శ
Pawan on YSRCP: జగన్ అమాయకుడు కాదు.. పవన్ కీలక వ్యాఖ్యలు
