HomeAndhra PradeshNara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం

Nara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం

Nara Lokesh in USA: అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో లోకేష్ డల్లాస్ లో సమావేశమయ్యారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ & పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయన్నారు. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్‌టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయన్నారు. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉందని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాలని లోకేష్ కోరారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించాలన్నారు. విశాఖపట్నంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నామని, ఏరోస్పేస్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరేవేర్చడం, ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో మీ అనుభవం, సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాలని లోకేష్ విన్నవించారు. విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టం ఉందన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రదేశం అని గుర్తు చేశారు. నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, ఏరోస్పేస్‌లో గ్లోబల్ ప్లేయర్‌లను ఆకర్షించడానికి మీ వంటి అనుభవజ్ఞుల నైపుణ్యం మాకు ఉపయోగపడుతుందన్నారు.

వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పీపీపీ ప్రాతిపదికన భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాలన్నారు. మంత్రి లోకేష్ వెంట బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు.

పెరోట్ జూనియర్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో విభిన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో ఆయన అగ్రగామిగా ఉన్నారు. అలయన్స్ టెక్సాస్‌తో సహా యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని విజయవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెరోట్ కీలక భూమిక పోషించారు. 27,000 ఎకరాల మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ అలయన్స్ టెక్సాస్‌ను అభివృద్ధి చేయడంలో రాస్ పెరోట్ జూనియర్ విశేషమైన గుర్తింపు పొందారు. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ ఏవియేషన్‌ రంగాల్లో పెరోట్ రూపొందించిన వెంచర్లు అమెరికాలో బిలియన్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపాయి. తన ప్రాజెక్ట్‌లలో అధునాతన సాంకేతికతలు, అంతరిక్ష ఆవిష్కరణలతో పెరోట్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు.

ఇవీ చదవండి: Nara Lokesh: ఏఐ చాన్సుల వినియోగం.. వేగంగా ఏపీ అభివృద్ధి
Nara Lokesh: 43వ రోజు ప్రజా దర్బార్.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: వైకాపా వాళ్లు నన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు: లోకేష్
Nara Lokesh: పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నా: లోకేష్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు