Free Gas Cylinders: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. రాయితీపై ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గంలో ఆమోదం కూడా లభించింది. ఈ క్రమంలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (Free Gas Cylinders) అమలు కోసం రాయితీ నిధుల విడుదలకు పాలనా పరమైన అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
లబ్ధిదారులకు ఒక సిలిండర్ రాయితీ మొత్తం రూ. 895 కోట్ల విడుదలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న ఉచిత సిలిండర్‌ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు అమలుకు కార్యాచరణ చేపట్టింది. మూడు ఉచిత సిలిండర్లకు రూ. 2,684 కోట్ల వ్యయం అవుతుందని అంచనా కట్టారు.
చంద్రబాబు ఇంటి హంగులకు రూ.1.44 కోట్లు
సీఎం చంద్రబాబు ఇంటి హంగులకు రూ.1.44 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరకట్ట నివాసంలో VVIP సదుపాయాల కోసం భారీ ఖర్చు చేస్తున్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం రూ.21లక్షలు, కరకట్ట నివాసం లోపల, బయట నిఘా కోసం రూ.81లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం ఇంటికి వచ్చే వాహనాల తనిఖీలు, నియంత్రణ ,యూవీఎస్ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం రూ.42లక్షలు వెచ్చించనున్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
సచివాలయంలో అదనపు సౌకర్యాలు
ఏపీ సచివాలయంలో మంత్రుల పేషీలకు కొత్త సౌకర్యాలు కల్పిసక్తున్నారు. మంత్రుల బాటలోనే ఓఎస్డీలు పయనిస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీ కోసం ప్రత్యేక ఛాంబర్ రెడీ చేస్తున్నారు. హంగూ ఆర్భాటాలతో కొత్త ఛాంబర్ ను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. సచివాలయంలో జనాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక గేటు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు రాకపోకల సమయంలో నియంత్రించేందుకు గేట్లు పెడుతున్నారు. అసెంబ్లీ గోడ నుంచి పార్క్ గేట్ల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. సీఎం సెక్యూరిటీ కోసం అంటూ ఇబ్బడిముబ్బడిగా నిధుల ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల పేషీల్లో వాస్తు పేరుతో సోకులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం పాలసీపై విచారణ
గత ప్రభుత్వ మద్యం పాలసీపై విచారణ చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సీబీసీఐడీ విచారణ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసిందన్నారు. తయారీ దగ్గర నుండి షాపులకు చేరేవరకు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. నాణ్యత లేని మద్యం సరఫరా చేశారని గుర్తు చేశారు.
తవ్వితే కఠిన చర్యలు
ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించారు. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను పెడతామని స్పష్టం చేశారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలుంటే.. ఇప్పుడు రూ.1500లకు తగ్గిందని తెలిపారు. మున్ముందు ఇసుక ధర మరింత తగ్గుతుందన్నారు. నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.
చార్జీల గురించి జగన్ మాట్లాడటమా?
విద్యుత్ ఛార్జీల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి పార్థసారధి అన్నారు. జగన్ ప్రభుత్వం తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. ట్రూఅప్ ఛార్జీలపై ఈఆర్సీ ప్రతిపాదన జగన్ ప్రభుత్వం చేసిన పాపమేనని చెప్పారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే రూ.6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం పడుతోందన్నారు.
ఇవీ చదవండి: CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Free Gas Cylinder: మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక అప్ డేట్!
CM CBN on Railway Projects: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
