TVK Vijay Maanadu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా అనుసరించిన విధానాన్నే ఇప్పుడు తమిళనాట (TVK Vijay Maanadu) హీరో విజయ్ అనుసరిస్తున్నారంటూ నెట్టింట హాట్ టాపిక్ నడిచింది. ర్యాంప్ వాక్, తెల్ల చొక్కా లైట్ కలర్ ప్యాంట్ ధరించి నమస్కరించుకుంటూ వెళ్లిన విధానాన్ని విజయ్ అనుసరించారు. తమిళనాడులో ఇవాళ విజయ్ భారీ బహిరంగ సభ నిర్వహించారు.

తమిళ రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన విజయ్.. గత ఫిబ్రవరిలో తమిళనాడు వెట్రికజగం అనే పార్టీని ప్రకటించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొట్ట మొదటి రాష్ట్ర సదస్సును విల్లుపురం జిల్లా వి.చలైలోని తిటిల్ లో నిర్వహించారు. సభా ప్రాంగణానికి లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చారు. దాదాపు 3 గంటలకు సభ మొదలైంది. విజయ్ 4 గంటలకు వచ్చి 101 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం తన పార్టీ సిద్ధాంతాలను ప్రస్తావిస్తూ ప్రసంగం చేశారు.
ప్రసంగం సందర్భంగా ఒకానొక సమయంలో విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ దేశాన్ని విభజన రాజకీయాల్లో ముంచెత్తేవారు మన రాజకీయ శత్రువులని వ్యాఖ్యానించారు. పెరియార్, అన్నా పేరును ఉపయోగించుకుని ద్రవిడ మోడల్ అని చెప్పుకోవడం తమకు రాజకీయ శత్రువు అని ఆయన చెప్పారు. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న డీఎంకే పార్టీలు తమ శత్రువులంటూ విజయ్ పరోక్షంగా వ్యాఖ్యానించినట్లయింది. ద్రవిడ, తమిళ జాతీయవాదం ఈ భూమికి రెండు కళ్లు అని చెప్పారు.
మరోవైపు విజయ్ ప్రసంగం, ఆయన హావభావాలు అచ్చం ఏపీ మాజీ సీఎం జగన్ తరహాలోనే ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. జగన్ మార్కు డ్రెస్సింగ్, నమస్కారం చేసే తీరు, ర్యాంప్ వాక్.. లాంటివి అచ్చం విజయ్ కి కూడా సరిపోయాయంటున్నారు. ఈ క్రమంలో ఆయన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

https://twitter.com/Fan_Of_JaGUN/status/1850502547234079225
ఇవీ చదవండి: The Goat: ఓటీటీలోకి విజయ్ ది గోట్.. ఎప్పటి నుంచంటే..
Vijay: సమానత్వాన్ని బలంగా సమర్థిస్తాం.. పార్టీ లోగో, ఫ్లాగ్ ఆవిష్కరణలో హీరో విజయ్
Pooja Hegde: విజయ్ సరసన పూజాహెగ్డే కన్ఫం?
