HomeAndhra PradeshAndhra Pradesh News: గత ప్రభుత్వ భూ రక్ష పథకంలో అవినీతి జరిగిందా?

Andhra Pradesh News: గత ప్రభుత్వ భూ రక్ష పథకంలో అవినీతి జరిగిందా?

Andhra Pradesh News: సర్వే రాళ్లపై రూ.700 కోట్లు తగలేసిన వ్యక్తి వైయస్ జగన్ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ఈ మేరకు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సెప్టెంబరులో వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టుగా నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో నిజంగానే సర్వేరాళ్లు నిరర్థకంగా మారాయా? లేక ఆ రాళ్ల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? (Andhra Pradesh News) అన్న చర్చ ప్రస్తుతం ఊపందుకుంది.

వందేళ్ల క్రితం బ్రిటీష్ వారు వేసిన సర్వే రాళ్ల ఆధారంగానే నేటికీ హద్దుల నిర్ణయం, రెవెన్యూ పత్రాల జారీ జరుగుతోంది. అప్పటి రికార్డులు శిథిలావస్థకు చేరడం, రెవెన్యూ రికార్డుల్లో తప్పులు చోటుచేసుకోవడం, కాలానికి తగినట్లు మార్పులు జరగకపోవడంతో భూ వివాదాలు తలెత్తి దశాబ్దాలుగా కోర్టుల్లో లక్షలాది సివిల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డిజిటలైజేషన్ వైపు ప్రపంచమంతా పరుగులు పెడుతుంటే.. రెవెన్యూ వ్యవస్థ మాత్రం పాత పద్ధతులే అనుసరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూ రికార్డుల్లో తప్పులు సరిచేయడానికి, వివాదరహిత భూ పత్రాలు జారీకి భూ రీసర్వే చేయాల్సిన ఆవశ్యకతను గత ప్రభుత్వం గుర్తించింది. 2020 డిసెంబర్ 21న వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ప్రారంభించింది.

ఇందులో భాగంగా భూముల సమగ్ర రీ సర్వేకి శ్రీకారం చుట్టింది. భూ హక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూ రక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడం రీ సర్వే ప్రధాన లక్యం. అత్యంత ఆధునిక సర్వే టెన్నాలజీతో డ్రోన్లు, కంటన్యుస్ లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ ఎస్). జీఎన్ ఎస్ఎస్ రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వేను నిర్వహించారు.

రెండు దశల్లో 4 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయగా, మూడో దశ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. దేశంలోనే తొలిసారి భూముల సమగ్ర సర్వే వంటి విప్లవాత్మక సంస్కరణను జగన్ సర్కారు తీసుకువస్తే.. సర్వే రాళ్లపై వైయస్ జగన్ బొమ్మలు వేసుకోవడానికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైయస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు.

ఈ పథకాన్ని వ్యతిరేకించిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా పథకం పేరు మార్చి కొనసాగించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి: Land Titling Act: 2019-24 మధ్య కాలంలో పేదలకు ఎంత భూమి పంపిణీ జరిగిందంటే..
PM Modi in Anakapalli: ఏపీలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియా నడుస్తోంది: అనకాపల్లిలో ప్రధాని మోదీ
CM Jagan on Land Titling Act: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రతిపక్షాల దుష్ప్రచారం.. సీఎం జగన్‌ వివరణ ఇదీ!
AP Cabinet Meeting: అసైన్‌మెంట్ ల్యాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ కేబినెట్‌లో నిర్ణయాలు..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు