HomeAndhra PradeshPolice Commemoration Day: నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం.. అణచివేసిన చరిత్ర

Police Commemoration Day: నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం.. అణచివేసిన చరిత్ర

Police Commemoration Day: పోలీసుల అమ‌రవీరుల సంస్మ‌ర‌ణ స‌భ‌లో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కీలక ప్ర‌సంగం చేశారు. న్యాయం కోసం, ధ‌ర్మం కోసం, ప్ర‌జ‌ల ప్రాణాలు కోసం (Police Commemoration Day) మ‌న పోలీసులు ప‌నిచేశారని కొనియాడారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు.

అన్ని శాఖ‌ల‌కంటే పోలీస్ శాఖ అంత్యంత కీల‌కం అని చంద్రబాబు అన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు క‌ష్ట‌ప‌డేది పోలీసులేనన్నారు. విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ర‌క్షించ‌డంలో కృషి చేసిన అంద‌రినీ అభినందిస్తున్నానన్నారు.

తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు, అమ్మ‌వారి ఉత్స‌వాలు బ్ర‌హ్మాండంగా చేశారని మెచ్చుకున్నారు. అంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో న‌క్స‌లిజాన్ని, రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్షనిజాన్ని, బెజ‌వాడ‌లో కూడా రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అదుపు చేసిన చరిత్ర ఏపీ పోలీసులదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

’’రాష్ట్రంలో జీరో క్రైమ్ ఉండాలి. లా అండ్ ఆర్డ‌ర్ అన్న‌ది మాకు మొద‌టి ప్రియారిటీ. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అనేక మార్పులు తీసుకువ‌చ్చాం. ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడ‌ల్ పోలీస్ గా తీర్చిదిద్దాల‌ని ముందుకు వెళ్లాం.

2014-19లో 600 కోట్లు ఖ‌ర్చు పెట్టాం, కొత్త గా వాహ‌నాలు కావాలంటే రూ.150 కోట్లు ఖ‌ర్చు పెట్టాం. పోలీస్ స్టేష‌న్లు, రెసిడెన్సియ‌ల్ క్వార్ట‌ర్స్ కానీ, మౌలిక స‌దుపాయాలు, మంగ‌ళ‌గిరి పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌, టెక్ ట‌వ‌ర్ నిర్మాణం కోసం రూ.170 కోట్లు ఖ‌ర్చు పెట్టాం. పోలీసు కార్యాల‌యాల రిపేర్ల కోసం రూ.60 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. లేటెస్ట్ టెక్నాల‌జీ కోసం 27 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఏపీఎస్ఎఫ్ ఎల్ తెచ్చాం.

క‌మ్యూనికేష‌న్ సిస్టం, డేటా సెంట‌ర్ ఏర్పాటు కోసం 25 కోట్లు వెచ్చించాం. వెప‌న్స్‌, మొబులిటీ కోసం, ఇత‌ర నిర్మాణం కోసం 80 కోట్లు ఇచ్చాం. పోలీస్ సంక్షేమం కోసం 5 ఏళ్ల‌లో 55 కోట్లు ఇచ్చాం. ఈ ఆఫీస్ కోసం రూ.20 కోట్లు ఖ‌ర్చు చేశాం. ఏపీఏప్ హెచ్‌సీఎల్ కింద 617 ప‌నుల‌కు రూ.300 కోట్లు ఖ‌ర్చు చేశాం.

గ్రేహౌండ్ ఎస్టాబ్లిష్ చేశాం. విశాఖ‌లో ప్ర‌త్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. కేంద్రం రూ.219 కోట్లు ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డితే గ‌త ప్ర‌భుత్వ కార‌ణంగా అది కూడా తీసుకోలేక‌పోయింది. కొత్త‌గా ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు, రీజ‌న‌ల్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.152 కోట్లు మంజూరు చేస్తే అది కూడా తీసుకోలేక‌పోయింది.

రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా పోలీసుల‌పై పెట్టే పెట్టుబ‌డి రాష్ట్ర అభివృద్ధిపై పెట్టే పెట్టుబ‌డి. నేర‌స్తులు లేటెస్ట్ టెక్నాల‌జీ ఫాలో అవుతుంటే.. పోలీసుల‌కు అలాంటి ప‌రిక‌రాలు లేక‌పోతే పోరాడ‌లేం.

ప్ర‌భుత్వం పోలీస్ వ్య‌వ‌స్థ‌పైన దృష్టి పెడ‌తాం, ఆధునిక ప‌రిక‌రాలు తెప్పిస్తాం. 125 రోజుల్లో 100 కోట్ల రూపాయ‌ల పెండింగ్ బిల్లులు అన్నీ క్లియ‌ర్ చేశాం. దిశ చ‌ట్టం లేక‌పోయినా దిశ పేరుతో వాహ‌నాలు కోరి రూ.16 కోట్లు పెండింగ్ పెడితే అది పే చేశాం. క‌మ్యూనికేష‌న‌ణ్ ప‌రిక‌రాల కోసం, నిర్మాణాలు, సైబ‌ర్ ల్యాబ్ కోసం రూ.20 కోట్లు గ‌త ప్ర‌భుత్వం పెండింగ్ పెడితే అది క్లియ‌ర్ చేశాం. కేంద్రం ఇచ్చే నిధుల్లో రాష్ట్ర వాటా కింద 2021-21 వరకు ఇవ్వాల్సిన రూ.61 కోట్లు ఈ ప్రభుత్వం రాగానే క్లియర్ చేశాం.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
Badvel Crime: విద్యార్థిని హత్య నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
CBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు