HomeAndhra PradeshBadvel Crime: విద్యార్థిని హత్య నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Badvel Crime: విద్యార్థిని హత్య నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Badvel Crime: వైయస్సార్ జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థిని మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బద్వేల్ లో (Badvel Crime) యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై తీవ్ర మనోవేదన కలిగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఘటనపై నిన్నటి నుంచి పోలీసు అధికారులతో మాట్లాడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆమెకు అందుతున్న చికిత్స గురించి, కేసు విచారణ గురించి తెలుసుకున్నారు.

నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే.. హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమే అని సీఎం వ్యాఖ్యానించారు.

ప్రత్యేక కోర్టు లో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్షపడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి సూచించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

ఇవీ చదవండి: Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు
Ramachandra Yadav: వెయ్యి ఆవులు, లక్ష గోవులు ఉచితంగా ఇస్తా.. టీటీడీకి సొంత డెయిరీ ఏర్పాటు చేయండి
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
AP Cheap Liquor: రూ.99 మద్యం కాంట్రాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు