HomeAndhra PradeshAP Free Sand: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ ఆదేశాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు...

AP Free Sand: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ ఆదేశాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ

AP Free Sand: ఇసుక పాలసీకి సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీలో మార్పులు చేసింది. (AP Free Sand) ఇందులో భాగంగా వైయస్సార్ సీపీ ప్రభుత్వ తరహాలోనే ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఇసుక తోడుకునేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం అనుమతించింది.

సొంత అవసరాలకు ప్రజలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచుల్లో ట్రాన్స్ పోర్ట్ చార్జీలు మాత్రమే కాకుండా రేట్లతో బోర్డులు పెట్టడంపై విమర్శలు వచ్చాయి.

అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇసుక పాలసీలో అనేకసార్లు మార్పులు చేర్పులు చేసింది. తాజాగా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, గతంలో వైయస్ జగన్ ప్రభుత్వం కూడా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై ఉచితంగా ఇసుక తీసుకెళ్ల వచ్చంటూ 2020 జూన్ 9న ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నం.1172, 70, 71) ఇచ్చింది. ఈ మేరకు నాటి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది జీవో జారీ చేశారు.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే అవకాశాన్ని నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు కల్పించారు.

సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్న వాళ్లు రీచ్ ల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా 5 కి.మీ. పరిధిలో ఇసుకను తెచ్చుకునే అవకాశం కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అనుమతులు తీసుకొనే వెసులుబాటు కల్పించారు.

వర్షాకాలం రాబోయే ముందే ఏటా 70 లక్షల టన్నులకుపైగా ఇసుకను ముందు చూపుతో నిల్వ చేసేలా జగన్ సర్కారు చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఇసుక పాలసీపై తీవ్ర విమర్శలు రావడంతో గత ప్రభుత్వంలో ఉన్న విధానాలనే కొనసాగిస్తూ తాజాగా కూటమి ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం గమనార్హం.

Read also: Free Sand: ఏపీలో ఉచిత ఇసుకపై దుమారం.. టన్ను కేవలం రూ.1,394 మాత్రమే!
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
Vangalapudi Anita: టెక్నాలజీతో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నాం
YSRCP: కూటమి నేతల జేబుల్లోకి ప్రజా సంపద
YS Jagan on Liquor: లిక్కర్ పాలసీపై వైయస్ జగన్ సంచలన ట్వీట్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు