HomeAndhra PradeshCBN in Party Meeting: చెత్తను వారసత్వ సంపదగా ఇచ్చి వెళ్లారు

CBN in Party Meeting: చెత్తను వారసత్వ సంపదగా ఇచ్చి వెళ్లారు

CBN in Party Meeting: మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో (CBN in Party Meeting) చంద్రబాబు మాట్లాడారు. చెత్తను వారసత్వ సంపదగా ఇచ్చి వెళ్లారంటూ జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు.

తెలుగుదేశం పార్టీ స‌మావేశంలో చంద్ర‌బాబు కామెంట్స్..

– 1995 నాటి సీఎంగా పని చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఒక 10 మంది మాత్రమే అప్పటి వాళ్లు ఉన్నారు.
– మళ్లీ మనందరం సంఘటిత శక్తిగా పని చేస్తే తప్ప ప్రజల ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టు పని చేయలేం.
– చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది. ఎన్డీయేలోఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా సీఎంపైనే పడుతుంది. పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి.
– 1995లో నేను సీఎం అయినప్పుడు చాలా ఫాస్ట్ గా వెళ్లాం. ప్రజలు కూడా అదే మాదిరిగా ఆశీర్వదించారు.
– రాజకీయ నాయకుడు ఎవరైనా మనం ప్రవర్తించిన విధానం వల్లే మన ఎలక్షన్, మనకొచ్చే మెజార్టీ గానీ డిపెండ్ అవుతుంది.
– మొన్న ఎన్నికల్లో నాకే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా సర్వేలు చేశాను.

– ప్రజలకు వాస్తవాలన్నీ చెప్పాలని 7 వైట్ పేపర్స్ ఇచ్చాం.
– అమరావతి ఏ స్టేజ్ లో ఉంది, పోలవరం ఏ విధంగా డయాఫ్రం వాల్ ఇవన్నీ నాశనం చేశారు.
– విద్యుత్.. 1.20 లక్షల కోట్లు అప్పులు చేయడం, కరెంటు ఇవ్వలేని పరిస్థితి.
– మద్యం హస్తగతం చేసుకుని కొన్ని వేల కోట్లు దోపిడీ చేసి, నాసిరకం మద్యం పంపిణీ చేశారు.
– సహజ వనరులు దోపిడీ చేయడం, ఇసుక, గ్రానైట్ దోపిడీ చేశారు.
– లా అండ్ ఆర్డర్ అయితే ఎవర్ని ముట్టుకున్నా వాళ్ల గత చరిత్ర వచ్చే పరిస్థితి. నిర్వీర్యం చేశారు.
– గంజాయి విపరీతంగా అయిపోయింది. నిన్న కూడా హిందూపురంలో జరిగిన ఘటన వెనుక గంజాయి ఉంది.

– రూ.10.50 లక్షల కోట్లు అప్పులున్నాయి. వడ్డీ కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి. బారో చేయాలంటే ఎఫ్ఆర్ బీఎం లేదు.
– కేంద్రం హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి నిలదొక్కుకున్నాం. లేకపోతే మనం వచ్చినా అరాచకం ఉండేది.
– ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం. ఈ విషయాలన్నీ మనం ప్రజలకు తెలియజేశాం.

– మెగా డీఎస్సీలో 16,347 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రాసెస్ కూడా మొత్తం మొదలైంది. డిసెంబర్ కు అంతా పూర్తి అవుతుంది.
– 60%, 70% ల్యాండ్ విషయాలే ఉన్నాయి. భూ కబ్జాలు, రికార్డులు తారుమారు చేయడం, ఎన్ క్రోచ్ మెంట్ చేయడం, ఎవరు వచ్చినా భూములపై కంప్లయింట్లు చేస్తున్నారు.

– వస్తూనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. అది మరీ భయంకరమైన చట్టం.
– పట్టాదారు పాస్ బుక్ పై వీళ్ల బొమ్మ వేసుకోవడం, ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్ ఉంటుంది, రాజకీయ నాయకుడిగా హద్దులుంటాయి, అవన్నీ మించి ప్రవర్తించారు.
– మనం వస్తూనే 5 సంతకాల్లో పింఛన్లు పెంచాం. రూ.4 వేలు ఇస్తామన్నాం. 64 లక్షల మందికి ఏప్రిల్ నుంచే అరియర్స్ తో కలిపి 7 వేల పెన్షన్ ఇచ్చాం. రూ.4 వేలు ఇస్తున్నాం. అదే సమయంలో 6 వేలు ఫిజికలీ చాలెంజ్ వారికి ఇస్తున్నాం.
– పదే పదే దీన్ని చెప్పడమే కాకుండా అర్హులకు పింఛన్లు అందే పరిస్థితి తీసుకురావాలి.

– అన్న క్యాంటీన్లు ఇప్పటికి 175, ఇంకా మిగిలినవి రెండీ అవుతున్నాయి. 203 ఇస్తున్నాం. ఇవి కాకుండా 60 నియోజకవర్గాల్లో లేవు. అక్కడ కూడా ఇమ్మంటున్నాం.
– స్కిల్ సెన్సస్ డిసెంబర్ కంతా అప్ డేట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో ఉపాధి కల్పించేదానిపై వర్కౌట్ చేస్తున్నాం.
– 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. పెన్షన్లు ఇస్తున్నాం. అన్ని డిపార్ట్ మెంట్స్ ను సమీక్ష చేశాం.
– పాత మద్యంలో జరిగిన దోపిడీపై యాక్షన్ తీసుకుంటూనే కొత్త ఎక్సైజ్ పాలసీ, శాండ్ పాలసీ తెచ్చాం.

– అవతలవాళ్లు చేసిన తప్పు డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి వస్తే మనకు, పార్టీ ఇమేజ్ కు ఇబ్బంది వస్తుంది.
– మాగుంట ఫ్యామిలీ మొదటి నుంచి లిక్కర్ లో ఉన్నారు. అలాంటి వారు ఓకే గానీ.. కొత్తగా ఇన్వాల్వ్ కావాలనుకుంటే పార్టీ ప్రతిష్ట పోతుంది.
– అవతలవాళ్ల దగ్గర దోచిన డబ్బులు బస్తాలు బస్తాలు ఉంది. ఏం చేసుకోవాలో తెలియదు. కానీ డబ్బులు ఖర్చు పెట్టలేదు. వారికి ఓట్లు వేయలేదు.

– గత ప్రభుత్వం క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్, వారసత్వ సమస్యల వల్ల బుడమేరుకు గండ్లు పడే పరిస్థితి వచ్చింది.
– నీళ్లన్నీ విజయవాడలోకి వస్తే కిందికి పోవడానికి వీల్లేకుండా చెరువు మాదిరి తయారైపోయింది.
– బోట్లు వేసుకుని కడాన నీళ్లు ఇవ్వడానికి ఐదారు రోజులు పట్టింది. ఇవ్వలేకపోయాం. చాలా సఫర్ అయ్యాం.
– నీళ్లలో నడిచాం, ఆఫీసర్లను నడిపించాం. ప్రపంచం అంతా చూసింది.

– రూ.450 కోట్ల పైన సీఎం రిలీఫ్ వచ్చింది. ఇన్నేళ్లు సీఎంగా ఉన్నా కానీ నేను పిలుపు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారంటే అదీ ఈ ప్రభుత్వంపై ప్రజలకు ఉండే నమ్మకం.
– రైతులకు రూ.1674 కోట్ల బకాయిలు పెట్టారు. వస్తూనే అవన్నీ క్లియర్ చేశాం. 48 గంటల్లోనే డబ్బులు పే చేసే విధానం తెచ్చాం.
– పంచాయితీరాజ్ కు ఇవ్వాల్సిన రూ.990 కోట్లు ఇచ్చి, రూ.4,500 కోట్లతో పల్లె పండుగ కింద కార్యక్రమాలు చేస్తున్నాం. జనవరికి పూర్తి చేసే లక్ష్యం.

– రోడ్లన్నీ గోతులు. ఎక్కడ చూసినా ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకోవడానికి లేకుండా ఐదేళ్లు నాశనం చేశారు.
– 290 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాం. మళ్లీ 486 కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చాం.
– సంక్రాంతి పండుగకంటే ముందే రోడ్లన్నీ రెక్టిఫై చేయాలని ఆదేశాలిచ్చాం.
– వాళ్లు గుంతలు, గోతులు తవ్వి వెళ్లారు. అవి పూడ్చడానికి 700 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది.

– మచిలీపట్నంలో మొన్న నేను పోతే స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వెళ్తే నాలుగు రోడ్ల కూడలిలో గుట్టలు గుట్టలుగా చెత్త వేశారు. 85 లక్షల మెట్రిక్ టన్నులు ఉందని మంత్రి నారాయణ చెప్పాడు.
– తిరుమల వెళ్లినప్పుడు తిరుపతి కలెక్టర్ ను అడిగితే 2.5 లక్షల టన్నులు ఉందని చెప్పాడు. మనకు సంపదగా చెత్తను ఇచ్చి పోయే పరిస్థితికి వచ్చారు.
– ఆరోజు 10 వేల షెడ్లు కట్టాం. కంపోస్ట్ ఎరువుగా, గార్బేజ్ వెహికల్స్ ఇచ్చాం.
– గార్బేజ్ నుంచి పవర్ జనరేషన్ కోసం 9 ప్రాజెక్టులుపెట్టాం. రెండే ముందుకొచ్చాయి. విశాఖ, గుంటూరు మాత్రమే పని చేస్తున్నాయి.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: CBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
CBN on BJP Alliance: బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల తృప్తి, ఆనందం: చంద్రబాబు
CBN on Liquor Syndicate: లిక్కర్ సిండికేట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు