HomeAndhra PradeshVangalapudi Anita: టెక్నాలజీతో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నాం

Vangalapudi Anita: టెక్నాలజీతో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నాం

Vangalapudi Anita: శ్రీసత్యసాయి జిల్లాలో ఈనెల 12న అత్తా కోడళ్ల మీద సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) అన్నారు. సంఘటన జరిగిన వెంటనే గవర్నమెంట్ స్పందించిందన్నారు. 48 గంటల్లోనే నిందితులను పట్టుకొని రిమాండ్ కు పంపామన్నారు. దీనిపై ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

మీడియాతో హోంమంత్రి వంగలపూడి అనిత..

* శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు
* ఎక్కడైనా ఏ సంఘటన జరిగిన ఒకేలా తీసుకొని ..ప్రతిరోజు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షలు చేశారు
* సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే వాళ్లు సీసీ కెమెరాలు బద్దలు కొట్టారు… కానీ టెక్నాలజీతో ఐదుగురు నిందితులను 48 గంటల్లో పట్టుకోవడం జరిగింది. అందులో 3 మైనర్లు ఉన్నారు. ఆ ముగ్గురి లో ఒకరిపై 32 కేసులు ఉన్నాయి..అవ్వన్నీ దొంగతనం కేసులు
* నిందితులకు శిక్ష పడాలని గౌరవ సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు

* ఈరోజు పాస్ట్ ట్రాక్ కోర్టు కావాలని గవర్నమెంట్ కోర్టుకు లేఖ రాయడం జరుగుతుంది
* లాస్ట్ ఐదేళ్లలో ఇన్ని సంఘటనలు జరిగిన ఒక స్పెషల్ కోర్టు కోసం లేఖ రాయలేదు
* కానీ ఇప్పుడు జరుగుతున్న నేరాలు దృష్ట్యా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగకూడదని, వాళ్లకి భరోసా కల్పించాలని ప్రభుత్వం ఉంది
* సీఎం చంద్రబాబు నిన్నకూడా డీజీపీ, పోలీసు అధికారులతో సమీక్షలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరాలు తగ్గాలి, అరికట్టాలని అధికారులకు ఆదేశించారు

* నేరం చేయాలన్న ఆలోచనకు కూడా భయపడాలి. ఎట్టి పరిస్థితుల్లో నేరాలు తగ్గించడమే మా ప్రాధాన్యం
* నేరాలు ఎక్కడ జరిగినా ముందే మేలుకోవాలి
* సీసీ కెమెరాలు విరివిగా ఏర్పాటు చేసుకోవాలి. కెమెరాలు లేని చోట డ్రోన్స్ వినియోగించాలి
* డ్రోన్స్ లేకపోతే మొబైల్ ఫోన్లు ఉపయోగించుకోవాలి. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా వీడియో తీస్తున్నారు
* ఇలాంటి వార్తలు మాకు ఇచ్చేట్లయేతే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం

* ఒకవేళ నేరం జరిగినట్లయితే నిందితులను కఠినంగా శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లో నేరం చేసినవాడు తప్పించుకోకూడదు
* పోలీసులకు నిధుల మంజూరులో ఎక్కడా రాజీ లేదు
* మహిళల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం
* ఇలాంటి కేసుల్లో జాప్యం లేకుండా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం
* మహిళల భద్రత విషయంలో చిన్న ఘటన జరిగినా సీఎం నేరుగా మాట్లాడుతున్నారు.

ఇవీ చదవండి: Ramachandra Yadav: వెయ్యి ఆవులు, లక్ష గోవులు ఉచితంగా ఇస్తా.. టీటీడీకి సొంత డెయిరీ ఏర్పాటు చేయండి
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
Nara Lokesh: వైకాపా వాళ్లు నన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు: లోకేష్
Andhra News: గెలిచిన తర్వాత ఖనిజ సంపదల ప్రత్యక్ష దోపిడీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు