TG DSC 2024: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన వారికి బిగ్ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ-2024 పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ డీఎస్సీ పరీక్షలు రాసి తుది ఎంపిక అయిన వారికి మెరిట్ ప్రకారం వాళ్లు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తామని విద్యాశాఖ తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది రాష్ట్ర విద్యాశాఖ.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana) డీఎస్సీ 2024 (DSC 2024) నిర్వహించింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే ఫలితాలు కూడా వెల్లడించింది. డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన టీచర్ అభ్యర్థులకు అక్టోబర్ 9వ తేదీన నియామక పత్రాలు కూడా అందించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మెగా డీఎస్సీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ లో 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులను భర్తీ చేశారు.
తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేశారు. వీరిలో 87.61 శాతం మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఫైనల్ గా 11,062 పోస్టుల్లో 10,006 పోస్టులకు అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. ఇంకా 1056 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.
డీఎస్సీ లో అభ్యర్థులకు వచ్చిన మార్కులు, టెట్ లో వచ్చిన మార్కులతో 20 శాతం వెయిటేజిని కలిపి డీఎస్సీ తుది ఫలితాలు ప్రకటించారు. అనంతరం జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు ఇచ్చి ఆపై 1:3లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తోంది.
ఇవీ చదవండి: Telangana CM: సీఎస్ఎంపీ, మూసీ, సీనరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి సహకరించండి
AP DSC 2024: ఏపీ డీఎస్సీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 31లోగా పూర్తి?!
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల
AP DCS Exam: ఏపీలో డీఎస్సీ పరీక్ష వాయిదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే..
Telangana: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు
