England: ఇంగ్లండ్ జట్టు రికార్డులను వేటాడింది. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే నాలుగో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది. ముల్తాన్ వేదికగా పాక్ జట్టుతో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్ ఈ ఘనతను అందుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 823 పరుగులు చేయడం విశేషం. అక్కడ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇప్పటి వరకు శ్రీలంక పేరిట ఉంది.
1997లో టీమిండియాతో జరిగిన టెస్టులో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇప్పటికే ఇంగ్లీష్ జట్టు ఇంగ్లండ్ పేరిటే ఉన్నాయి. ఇంగ్లండ్ టీమ్ 1938లో ఆస్ట్రేలియాపైన, 1930లో వెస్టిండీస్‌పైన వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసి రికార్డులు పదిలంగా ఉంచింది.
తాజాగా ఇంగ్లండ్, పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ లో పాక్ జట్టు కుదేలైంది. నాలుగో రోజు చివరి సెషన్‌లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బయట పడాలంటే మరో 130 రన్స్ తప్పకుండా చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లే ఉండటం గమనార్హం. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట కొనసాగాల్సి ఉంది.
ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) ముగ్గురూ సెంచరీలతో రాణించారు. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 3 వికెట్లు తీసుకున్నాడు. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ట్టు 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లిష్ జట్టు ఆటగాళ్లలో జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో పాక్ పై విరుచుకుపడ్డారు. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) హాఫ్ సెంచరీలతో పాక్ పై ప్రతాపం చూపించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ తీసుకున్నారు.
267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాకిస్తాన్.. జెట్ స్పీడ్ తో వికెట్లు సమర్పించుకుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ డకౌట్, సైమ్ అయూబ్ 25 రన్స్, షాన్ మసూద్ 11 పరుగులు, బాబర్ ఆజమ్ 5 రన్స్, సౌద్ షకీల్ 29 పరుగులు, మొహమ్మద్ రిజ్వాన్ 10 రన్స్ మాత్రమే చేశారు. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ ను నడ్డి విరచడంలో ఇంగ్లండ్ బౌలర్లు అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి కీలక పాత్ర పోషించారు.
Read also: Rohit Sharma: హిట్ మ్యాన్ వేలంలోకి వస్తే బాక్సులు బద్దలే!
Maa Nanna Superhero Review: మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ..
Rakul Preet singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రగ్యా బర్త్ డే విశెష్.. అందాల భామల హాట్ పోజులు
Rafael Nadal: టెన్నిస్‌కు రఫెల్ నాదల్ వీడ్కోలు.. తీవ్ర భావోద్వేగం
Nitish Kumar Reddy: బంగ్లాపై తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా.. సిరీస్ కైవసం
