HomeAndhra PradeshDasara: ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి

Dasara: ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి

Dasara: దసరా పర్వదినం సందర్భంగా ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి (Dasara) పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన విశెస్ చెప్పారు. (Dasara)

లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు.

ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Read also: YS Jagan on Mopidevi: మోపిదేవి పార్టీ వీడటంపై జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan Good Book: గుడ్ బుక్ రాస్తున్నాం.. ప్రమోషన్లు కల్పిస్తాం!
YS Jagan: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ
YS Jagan: పాలన కుప్పకూల్చి దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు: జగన్ ధ్వజం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు