HomeAndhra PradeshPithapuram: దళిత బాలికపై అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్

Pithapuram: దళిత బాలికపై అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్

Pithapuram: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పిఠాపురంలో (Pithapuram) దళిత బాలికపై టీడీపీ నేత అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత దుర్గాడ జాన్ తో పాటుగా.. అతనికి సహకరించిన సుబ్బలక్ష్మి ని కోర్ట్ కు తరలించారు. నిందితులపై బిఎస్ఎన్ సెక్షన్ల తో పాటుగా పోక్సో, జువైనల్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేశారు.

రెండు రోజుల క్రితం టీడీపీ నేత దుర్గాడ జాన్ దళిత బాలికపై అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. బాలికకు మద్యం తాపించి ఓ మహిళను కాపలాగా పెట్టి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది.

పిఠాపురంలో అన్నదాత కన్నీరు..

ఏలేరు వరద సయం అందకపోవడంతో నామాల సూరిబాబు అనే కౌలు రైతు పిఠాపురంలో తీవ్ర మనస్తాపం చెందాడు. తనకు గత్యంతరం లేదంటూ ఆత్మహత్య చేసుకోవడానికి చెట్టు ఎక్కిన సూరిబాబును.. గ్రామస్తులంతా బతిమాలారు. వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామస్తులు సర్ది చెప్పడంతో సూరిబాబు చెట్టు దిగాడు. తనకు వరద కారణంగా తీవ్రంగా నష్టం జరిగిందని వాపోయాడు. ఈ క్రమంలో సాయం అందకపోవడంతో తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. గ్రామస్తులందరితో చెప్పుకొని తీవ్రంగా విలపించాడు.తమ గ్రామంలో 40 మంది రైతులకు ఏలేరు వరద సాయం అందలేదని గ్రామస్తులు తెలిపారు.

ధర్మవంలో సీఐ తల్లి హత్యపై పోలీసులు ఏమన్నారంటే..

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారిని నిందితుల ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేశారని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం వెంకటేష్, ఎల్లమ్మ, అనిల్, రమాదేవి అనే నలుగురు వ్యక్తులు ఉండగా వెంకటేష్‌ను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

మదనపల్లె మండలం కోళ్ళబైలు జగన్‌ కాలనీకి చెందిన స్వర్ణకుమారి అదృశ్యంపై సెప్టెంబరు 28న రూరల్ పోలీసులు కేసునమోదు చేశారు. కుమారుడు సీఐ నాగేంద్రప్రసాద్ పిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు.. ఈ మేరకు నిందితులను అరెస్టు చేశారు.

Read also: Pithapuram: పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం.. ప్రతిపక్షంలో ఉంటే పవన్ ఎలా స్పందించే వారు?
Pithapuram: పిఠాపురం.. ఎమ్మెల్యేగారి తాలూకానా? డిప్యూటీ సీఎం గారి తాలూకానా?
Pithapuram: పిఠాపురంలో మంటపెట్టిన పవన్‌ కల్యాణ్‌ ప్రకటన.. వర్మ వర్గం అగ్గిమీద గుగ్గిలం..!
Ram charan Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రామ్ చరణ్..?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు