Logi Tech Keyboard: లాజిటెక్ తన కొత్త POP ఐకాన్ కీలను POP మౌస్‌తో పాటు (Logi Tech Keyboard) భారత మార్కెట్ లో ప్రారంభించింది. స్విస్ కంపెనీ తాజా వైర్‌లెస్ కీబోర్డ్ ట్రాన్స్ పరెంట్ ఫినిష్ తో వస్తోంది. నాలుగు కస్టమైజ్డ్ యాక్షన్ కీలతో కీబోర్డ్ వస్తోంది. అయితే POP మౌస్ రెండు యాక్షన్ బటన్‌లను కలిగి ఉంటుంది. లాజిటెక్ POP ఐకాన్ కీలు మ్యూట్, ఎమోజి మెనూ మరియు స్క్రీన్‌షాట్ వంటి 1-టచ్ షార్ట్‌కట్ కీలను కూడా అందిస్తాయి. కీబోర్డ్, మౌస్ రెండూ మల్టీ డివైజ్ కనెక్టివిటీతో వస్తున్నాయి. లాజిటెక్ POP ఐకాన్ కీలు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 నెలల బ్యాటరీ లైఫ్ అందిస్తాయట.
భారతదేశంలో ధర
లాజిటెక్ POP ఐకాన్ కీస్ ధర భారతదేశంలో రూ.6,695. ఇది రోజ్ ఆఫ్‌వైట్, ఆరెంజ్ ఆఫ్‌వైట్, గ్రాఫైట్ గ్రీన్, లిలక్ ఆఫ్‌వైట్ మరియు గ్రాఫైట్ ఆఫ్‌వైట్ షేడ్స్‌లో లభిస్తోంది. లాజిటెక్ POP ఐకాన్ కీలు మరియు POP ఐకాన్ కీల కాంబో ధర రూ.9,295. మరోవైపు లాజిటెక్ POP మౌస్ ధర రూ.3,595గా ఉంది.
లాజిటెక్ POP ఐకాన్ కీస్ అనేది Windows, macOS, Chrome OS, Android, iOS మరియు iPadOS పరికరాలకు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసే బ్లూటూత్ కీబోర్డ్. ఇది Logi Options+ కంపానియన్ యాప్‌ని ఉపయోగించి నాలుగు కస్టమైజ్డ్ కీలతో వస్తుంది. ఉత్పాదకత సాధనాలను యాక్సెస్ చేయడానికి, సోషల్ మీడియా యాప్‌లు, సంగీతం మరియు వీడియో యాప్‌లను తెరవడం లేదా లాజిటెక్ స్వంత Logi AI ప్రాంప్ట్ బిల్డర్‌తో సహా కృత్రిమ మేధస్సు సాధనాలను కూడా ఒకే కీ ప్రెస్‌తో యాక్సెస్ చేయడానికి యాక్షన్ కీలను ఉపయోగించవచ్చు.
లాజిటెక్ POP మౌస్ కచ్చితమైన నావిగేషన్ మరియు సైలెంట్ టచ్ టెక్నాలజీ కోసం స్మార్ట్‌వీల్‌ను కలిగి ఉంది. ఇది 90 శాతం క్లిక్ నాయిస్‌ను తొలగిస్తుంది. మౌస్ Logi Options+ యాప్ ద్వారా కస్టమైజ్ చేయబడిన రెండు యాక్షన్ బటన్‌లను కలిగి ఉంది. యూజర్లు దీన్ని మూడు పరికరాల మధ్య కనెక్ట్ చేయవచ్చు. మార్చవచ్చు. మౌస్‌పై ఉన్న బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 నెలల వరకు వస్తుందట.
Read also: Laptop brightness: ల్యాప్ టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎంత పర్సెంట్ ఉంటే మంచిది?
Constable Jobs: ఏపీలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ.. 5 నెలల్లో పూర్తికి కసరత్తు
Hyderabad: న్యూడ్ ఫొటోలు పంపుతావా.. లేదా.. ఐటీ ఉద్యోగికి వేధింపులు
Galla Madhavi: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే భర్తపై అట్రాసిటీ కేసు!
