MP Avinash Reddy: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు వైఖరితో ఈ సంవత్సరం 750 మెడికల్ సీట్లు రాష్ట్రం కోల్పోయిందని కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) అన్నారు. పులివెందులకు ఈ సంవత్సరం 150 మెడికల్ సీట్లు వస్తే 50 సీట్లు వద్దని వెనకు పంపారని గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నడిపే ఉద్దేశం లేదని మండిపడ్డారు. వారి దృష్టి ప్రైవేట్ మెడికల్ కళాశాల మీదే ఉందన్నారు. కడప పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి కేవలం జగన్ మోహన్ రెడ్డిని దూషించడానికి వచ్చినట్లుందని ఫైర్ అయ్యారు.
పెంచిన 50 సీట్లు వస్తే జగన్ మోహన్ రెడ్డికి పేరు వస్తుందని.. బాధపడుతున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల విద్యార్థులు సీట్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ సీట్ల గురించి మంత్రిని అడిగితే జగన్ మోహన్ రెడ్డిని దూషిస్తున్నాడన్నారు.
జిల్లాలో అక్రమ మైనింగ్ కోసం జిలెటిన్ స్టిక్ లు తీసుకువచ్చి వాటితో హత్యలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించదానికి కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తనపై చేసిన అసత్య ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. వందరోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు.
Read also: YS Jagan: పాలన కుప్పకూల్చి దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు: జగన్ ధ్వజం
YS Sharmila: 4,200 మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి: షర్మిల డిమాండ్
YS Jagan: నేను భారతీయుడిని.. నా మతం మానవత్వం: వైయస్ జగన్
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం?
