Tirupati Varahi Sabha: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం గురించి గతంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పవన్ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి వారాహి బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
’’నేను ఇన్ని సంవత్సరాలు ధర్మం పట్టుకుని నిలబడ్డాను.. ఎప్పుడూ ధర్మం తప్పలేదు..ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ చేస్తే ఆపేసి గౌరవం పాటించాను.. అనేకపర్యాయాలు.. నిన్న నా కూతరు రష్యన్ ఆర్థోడక్సి వాళ్ల మథర్.. ఆ చర్చికి సంబంధించిన వ్యక్తులు.. నా కూతురిని తిరుమలకి తీసుకెళ్తే.. ఇంట్లో పూజలు చేసినా కానీ.. నేను ఇక్కడికి వచ్చి చిత్తశుద్ధి చూపించాను.. నా కూతిరి చేత డిక్లరేషన్ ఇప్పించాను..
నన్ను విమర్శించే వాళ్లు అందరికి చెప్తున్నా.. ఏ రస్తా అయితే.. ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో.. గెలుస్తుందో.. ఓడుతుందో.. కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా.. ఏ రస్తాలో కూడా సంకెళ్లు సవాల్ చేస్తాయో.. ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్నిజ్వల అయి మండుతుందో అదే నా రస్తా.. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రభంజనం గా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా.. అందుకే పరాభావం చెందిన, పరాజయాలు పొందిన ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నానంటే.. నా సనాతన ధర్మం మీద ఉన్న అచంచలమైన విశ్వాసం.
ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దానిని అంతం చేస్తాం అంటున్నారు కొందరు.. గతంలో శ్రీరామచంద్రుడిని కొన్ని దశాబ్ధాల క్రితం పాదరక్షలతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు.. రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెబితే.. కాదు కాదు.. విషవృక్షం అన్నారు.. మొన్న ఈ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు.. కొంతకాలంగా కల్తీ నెయ్యితో, జంతువు కొవ్వుతో కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేధ్యంగా పెడతారు.. అదే ప్రసాదాలు రాష్ట్రం నుంచి లక్ష లడ్డూలు చేసి ఆ కల్తీ నెయ్యితో అయోధ్య రాముడికి పంపిస్తారు.. దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని నాచ్ ఘానా.. నాచ్ ఘానా..నాచ్ ఘానా చెప్తారు.. మా మనోభావాలు దెబ్బతినవు.
హిందువులుగా రాముడిని తిడితే మనం బాధపడకూడదు.. నోరెత్తకూడదు.. తిరిగి అన్నాము అనుకోండి వెంటనే మనం హిందూమతోన్మాదులం అయిపోతాము. హిందువులుగా రాముడిని తిడితే మనం బాధపడకూడదు.. నోరెత్తకూడదు.. తిరిగి అన్నాము అనుకోండి వెంటనే మనం హిందూమతోన్మాదులం అయిపోతాము..వీళ్లు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు.. కానీ మనకు బాధపడే హక్కు లేదు.. బాధను వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు.. భారతదేశంలో సెక్యూలరిజం అంటే.. హిందూ ధర్మాన్ని దూషించూ, అపహాస్యం చేయ్, అన్యమతాన్ని వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం.. ఎకార్డింగ్ టూ సో కాల్డ్ సూడో సెక్యూలరిజం..దశాబ్దాలుగా చూస్తున్నాం..
ఇదేమి కొత్త కాదు.. చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయి అంటే.. సనాతన ధర్మాన్ని పాటించే వారి వైపు నిర్ధాక్షిణ్యంగానూ, అన్య ధర్మాలను పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు.. దూషణలు చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి.. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు.. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి.. చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు.. సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవారికి.. ఇదేమీ నేను సరదాగా చెప్పట్లేదు.. దీనికి ఒక యువ నాయకుడు స్టేట్ మెంట్ అన్న మాటలు.. సనాతన ధర్మం ఒక వైరస దానిని అంతం చేస్తాం.. మీరు ఇలాంటి స్టేట్ మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే దేశంలోని కోర్టులన్నీ స్పందిస్తాయి.. నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి.. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి.. శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి.. ఏదైనా చేయండి కోర్టులు మాట్లాడవు..కోర్టులు కూడా భయపడతాయి’’ అని పవన్ అన్నారు.
ఇవీ చదవండి: Pawan Kalyan: 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదు
Pawan Kalyan: ఒకే రోజు 13,326 గ్రామ సభలు.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
Pawan Kalyan: పవన్.. ఏపీ రాజకీయాల్లో తుఫాన్ కావడానికి కారణాలేంటి?
Akira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్
Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగం.. అన్నయ్య కాళ్లు మొక్కి కౌగిలిలో ఒదిగిపోయిన పవన్
