Pawan Kalyan: తిరుపతి వారాహి సభలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ రేంజ్ లో ప్రసంగించారు. వైయస్సార్ సీపీపైన ధ్వజమెత్తారు. సనాతన ధర్మం గురించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. దశాబ్ధంపైనా తనను వ్యక్తిగతంగా తిట్టారని, కించపరిచారని, అవమానించారని చెప్పారు. పరాభావం చెందినా ఏరోజూ మాట అనలేదన్నారు. పవన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవీ..
– ఏడుకొండల వాడికి కూడా అపచారం జరిగితే ఎందుకు ఊరుకుంటాం.. మాట్లాడకుండా ఎందుకు ఉంటాం.. ప్రతీది రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్నీ ఓట్ల కోసమేనా?
– నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను..నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాకూడదు అనుకున్న.. కానీ వైయస్ఆర్సీపీ నాయకులు తెప్పించారు..
– ధర్మో రక్షతీ.. రక్షితః.. ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే అది చట్టం అవుతుంది..
– నాకు అన్యాయం జరిగింది నేను బయటకు రాలేదు.. అన్ని ధర్మాలకు గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజూ కొన్ని దశాబ్ధాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు.. భరిస్తూనే ఉన్నాం..కల్తీ ప్రసాదాలు పెట్టారు..ఇదే తిరుపతిలో అపచారం జరుగుతుంది.. సరిదిద్దుకోండని గతంలో వారాహి సభలో చెప్పాను వినలేదు.. 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ది రాలేదు..
– ఇది భగవంతుడు సమయం.. ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా.. వారు అల్లా అంటే ఆగిపోతారు.. మనం గోవిందా అన్న ఆగము.. మన దేశ దౌర్భాగ్యం మన హైందవ ధర్మానికే గౌరవం ఇవ్వము.. ఎప్పుడు గౌరవం ఇవ్వాలి.. ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అనేది యువత నేర్చుకోవాలి
– నేను వచ్చింది ఇక్కడికి మీతో జేజేలు కొట్టించుకోవడానికి రాలేదు..గొడవ పెట్టుకోవడానికి వచ్చాను.. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో.. ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తా అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను.. ఈరోజు..
డిప్యూటీ సీఎంగానో, జనసేన అధ్యక్షుడిగా ఇక్కడికి రాలేదు.. సగటు భారతీయుడిగా, సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా మీముందుకు వచ్చాను.. సగటు భారతీయుడిగా, నా సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను.. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్యమతాలను గుండెలనిండుగా గౌరవిస్తాను.
భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం.. ఇతర మత ధర్మాలను గౌరవించేది సనాతన ధర్మం.. ఈ ప్రపంచం మనుషులు ఒక్కరే బాగుండాలని కోరుకోలేదు.. వసుధైక కుటుంబం..పశువులు, పక్షులు, మనుషులు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు సుఖంగా ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం..అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి.. ధర్మానికి నిలువెత్తు స్వరూపం ఆయన.. సాక్షాత్తూ శ్రీమహావిష్ణు రూపం ఆయన.. అదే కలియుగం శ్రీవెంకటేశ్వరుడు, బాలాజీ పెరుమాళ్ అని కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది.. దానికి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే.. దాన్ని రాజకీయం చేయొద్దు అంటారు.. అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు..నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్లందరకి పాపంలా మాట్లాడతారు.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇవీ చదవండి: Pawan Kalyan: ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఒకే రోజు 13,326 గ్రామ సభలు.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
Pawan Kalyan: పవన్.. ఏపీ రాజకీయాల్లో తుఫాన్ కావడానికి కారణాలేంటి?
Akira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్
Modi Pawan Kalyan: జనసేనానిపై మోదీ పొగడ్తలు.. పవన్ కాదు.. తుఫాన్
