Jani Master: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని కటకటాలపాలైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master)కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి వెళ్లాలని, అందుకోసం బెయిల్‌కు ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చింది.
అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 గంటలకు తమ ఎదుట హజరు కావాలని కోర్టు ఆదేశించింది. రూ.2లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, అలాగే మరో మారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయరాదని కూడా షరతు పెట్టింది.
తనపై జానీ లైంగికంగా వేధింపరులకు దిగాడని ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో అసిస్టెంట్ డ్యాన్సర్ గా చేరాను. ముంబైలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు అసిస్టెంట్లు వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తీసేస్తానని, సినిమా పరిశ్రమలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడు.
దీన్ని ఆసరాగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా షూటింగులకు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేకసార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ టీమ్ నుంచి బయటకొచ్చచేశా. అయినా వేధింపులు ఆపలేదు.’’ అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకున్నారు.
కాగా ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు ఇటీవల జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని అందుకునేందుకు వెళ్లాలని, అందుకే బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరడంతో ఈ మేరకు మధ్యంతర బెయిల్ వచ్చింది.
Read also: Konda Surekha: కొండా సురేఖపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫైర్ ఎవరెవరు ఖండించారంటే..
Ravindranath Reddy: రాయలసీమపై చంద్రబాబుకు తొలి నుంచి కక్ష సాధింపే
Sharmila: 48 గంటల్లోపే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయం
Jail: ప్రపంచంలోనే అత్యంత క్రూయల్ జైల్ ఏదో తెలుసా?
MP Avinash Reddy: బాబు వైఖరితో ఈ ఏడాది 750 మెడికల్ సీట్లు కోల్పోయాం: అవినాశ్ రెడ్డి
