HomeInternationalType 1 Diabetes: చైనా సరికొత్త ఆవిష్కరణ.. టైప్‌-1 డయాబెటిస్ కు విముక్తి

Type 1 Diabetes: చైనా సరికొత్త ఆవిష్కరణ.. టైప్‌-1 డయాబెటిస్ కు విముక్తి

Type 1 Diabetes: టైప్‌-1 డయాబెటిస్ ను అరికట్టేందుకు సరికొత్త చికిత్స విధానాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈమేరకు ప్రకటన చేశారు. మూలకణ మార్పిడితో ప్రపంచంలోనే తొలిసారిగా ఓ బాధితురాలిలో ఆ వ్యాధిని నయం చేశామని వెల్లడించారు. దశాబ్ద కాలానికిపైగా టైప్‌-1 డయాబెటిస్ తో బాధపడిన సదరు బాధితురాలు.. చికిత్స ముగిసిన రెండున్నర నెలల తర్వాత నుంచి ఇన్సులిన్‌ తో పని లేకుండా నార్మల్ గా బ్లడ్ లో షుగర్ నిల్వలను నియంత్రించుకోగలుగుతున్నారని సైంటిస్టులు తెలిపారు.

తియాంజిన్‌ ఫస్ట్‌ సెంట్రల్‌ హాస్పిటల్, పెకింగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ చికిత్సలో కీలక భూమిక పోషించారు. ‘సెల్‌’ జర్నల్‌లో ఈ వివరాలు పబ్లిష్ అయ్యాయి. ఐలెట్‌ కణాల మార్పిడిని టైప్‌-1 డయాబెటిస్ కు సమర్థ చికిత్సగా ఇప్పటివరకు నిపుణులు చెప్పేవారు.

క్లోమంలో ఉండే ఐలెట్‌ కణాలు ఇన్సులిన్, గ్లుకగాన్‌ వంటి హార్మోన్ల ప్రొడక్ట్ పనులు చేస్తాయి. ఆ హార్మోన్లు రక్తంలోకి విడుదలై గ్లూకోజ్‌ స్థాయిల నియంత్రణకు సాయ పడతాయి. ఐలెట్‌ మార్పిడి విధానంలో.. తొలుత మృతుల (దాతల) క్లోమం నుంచి ఐలెట్‌ కణాలను తీసుకుంటారు. టైప్‌-1 డయాబెటిస్ రోగుల కాలేయంలో వీటిని ప్రవేశపెడతారు. దాతల కొరత కారణంగా ఈ చికిత్స అంతగా సక్సెస్ కావడం లేదు.

Read also: China President: చైనాలో ముందెన్నడూ లేని వింత పరిస్థితి.. యువతులు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ అధ్యక్షుడి వేడుకోలు
Iraq: ఆ దేశంలో అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చట!
Magha Masam Marriages: మాఘమాసం పెళ్లిళ్ల సీజన్‌ షురూ.. మాఘమాసం విశిష్టతలు ఇవీ..
Diabetes: మధుమేహం ఉందా? రోజూ 45 నిమిషాల పాటు ఇలా చేయండి
Type 2 Diabetes: టైప్-2 డయాబెటిస్ లక్షణాలు.. ఎలా కంట్రోల్‌ చేయాలంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు