ICICI cash back: యాపిల్ ఐఫోన్ కొనాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. మిగిలిన వాటితో పోల్చితే వీటి ధరలు కాస్త అధికంగానే ఉన్నప్పటికీ కొనుగోలుకు చాలా మంది వెనుకాడరు. నాణ్యత, పనితీరు విషయంలో ఇవి చాలా బెటర్ గా ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఐఫోన్ 16 విక్రయాలు బాగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఐఫోన్ తో పాటు ఇతర ఆపిల్ వస్తువుల కొనుగోలుపై ప్రత్యేక డీల్ ను ఐసీఐసీఐ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ను ఇస్తోంది. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారికి ఇది అప్లికబుల్. ఇందులో భాగంగా తమ క్రెడిట్, డెటిట్ కార్డులతో ఐఫోన్ 16ను కొనుగోలు చేసిన ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులు రూ.5 వేలు వరకు వెంటనే తిరిగొ పొందవచ్చు. అలాగే యాపిల్ వాచ్ పై రూ.2,500, ఎయిర్ ప్యాడ్ లపై రూ.1,500 దాకా తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉంటుందని బ్యాంకు తెలిపింది.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారికి మరో అదనపు ప్రయోజనం దక్కుతుంది. యాపిల్ కు సంబంధించిన ఐఫోన్ ఫర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ ను రిజిస్టర్ చేసుకునే చాన్స్ ఉంది. రూ.2,497 చొప్పున 24 నెలల పాటు ఇంట్రెస్ట్ ఫీజు లేకుండా ఈఎంఐలలో సెలెక్టెడ్ ఐఫోన్ ను కొనేందుకు వీలుంటుంది. అలాగే తమ ఫోన్ ను అప్ గ్రేడ్ చేసినప్పుడు ఇప్పటికే కొనుగోలు చేసిన ఐఫోన్ కు గ్యారంటీ బై బ్యాక్ ఆప్షన్ అప్లికబుల్ ఉంటుంది. ఆ అవకాశం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 లపై ఉంటుంది.
కొత్తగా విడుదలైన ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఈ జాబితాలో ఉండడం వల్ల కస్టమర్లకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ ఫోన్లలో వీటిలో పెద్ద డిస్ ప్లే, కెమెరా నియంత్రణ, ప్రో కెమెరా ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ సామర్జ్యం, ఏ18 ప్రో చిప్ తదితర ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
Read also: AP Banking Good: ఆంధ్రప్రదేశ్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు
Nithya Menon: పెళ్లి గురించి నిత్యా మీనన్ అభిప్రాయం ఏంటంటే..
SBI Good News: డిపాజిటర్ల కోసం శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ..
SBI Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ.. మొత్తం ఎన్ని బాండ్లు అంటే?
October 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ఇవి తప్పక తెలుసుకోండి
