HomeBusinessCitroen C3: టాటా పంచ్‌కు పోటీ ఫీచర్స్‌తో సిట్రోయెన్ సీ3.. ఫీచర్స్ ఇవీ

Citroen C3: టాటా పంచ్‌కు పోటీ ఫీచర్స్‌తో సిట్రోయెన్ సీ3.. ఫీచర్స్ ఇవీ

Citroen C3: ఫ్రెంచ్ దేశానికి చెందిన కారు బ్రాండ్.. సిట్రోయెన్ సీ3 సరికొత్త ఫీచర్స్ తో ఉంది. ఈ సంస్థ ముఖ్యమైన ఫీచర్ అప్‌డేట్‌లను ప్రకటించిన నెల రోజుల తరువాత ఆటోమేటిక్ వేరియంట్ ధరలను తాజాగా వెల్లడించింది. అయితే, ఇది కేవలం టాప్-స్పెక్ షైన్ రూపంలోనే అవైలబుల్ ఉంటుదని తెలిపింది. సీ3 ఆటోమాటిక్ ధరలు రూ.10 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి.

సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ వేరియంట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో వస్తాయి. అయితే, ఇది చూడటానికి రమారమి స్టాండర్డ్ మోడల్ లానే ఉంటుంది. డిజైన్ కొంత అప్డేట్ అయింది. అయినప్పటికీ ఫీచర్స్ లిస్టులో మాత్రం మాన్యువల్ వేరియంట్‌తో ఈక్వల్ గా ఉంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.2 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఈ కారులో ఉంటాయి.

సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ కారు 1.2 లీటర్ టర్బో పిత్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ తో వస్తుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో వస్తుంది. అయితే, భారత మార్కెట్ లో టాటా పంచ్, హ్యూండయ్ ఎక్స్‌టర్ లాంటి వాటికి ఈ కారు పోటీగా నిలిచే చాన్స్ ఉంది.

ఇవీ చదవండి: T10 Cricket: టీ10 క్రికెట్‌లో సంచలనం.. స్కాట్లాండ్ బ్యాటర్ రికార్డు సెంచరీ 
CM Revanth Reddy: రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్.. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
MLC Botcha: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి
Kalki Trailer: కల్కి ట్రైలర్‌ ఆగయా.. రికార్డ్స్‌ చెక్‌ చేసుకోమంటున్న ప్రభాస్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు