HomeAndhra PradeshYS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం

YS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈనెల 28వ తేదీన శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. కొన్ని రోజులుగా తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో రాజకీయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అటు టీడీపీ, ఇటు కూటమి నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తిస్తున్నారు.

వైయస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామి వారిని దర్శించుకోవాలని బీజేపీ, టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైయస్సార్ సీపీ మాత్రం ఇందుకు కౌంటర్ ఇస్తోంది. వైయస్ జగన్ ఇప్పటి వరకు చాలా సార్లు తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకున్నారని ఏరోజూ లేని డిక్లరేషన్ వివాదం ఇప్పుడు తెరపైకి తేవడం రాజకీయం మాత్రమేనని, మత రాజకీయాలకు ఏపీలో చోటు లేదంటున్నారు.

వైయస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నోల రోజులపాటు పోలీసులు ఆంక్షలు విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 25-09-2024 వ తేదీ నుంచి 24-10-2024 వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందన్నారు.

ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని పోలీసులు పేర్కొన్నారు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడన్న వార్తలపై ఆయన ఇవాళ బయటకు వచ్చి రియాక్ట్ అయ్యారు. ఈనెల 24 తేదీ రాత్రి విధినిర్వహణలో ఉండగా అస్వస్థత కు గురయ్యానని, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని వివరణ ఇచ్చారు. అయితే, ఈలోగా తనపై మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని, తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవంటూ చెప్పారు. సాధారణ బదిలీల్లో భాగంగానే తనకు వీఆర్ ట్రాన్స్ ఫర్ అయ్యిందంటూ చెప్పారు. అయితే ప్రభుత్వం బెదిరించి సీఐతో ఇలా చెప్పించిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు