CM Revanth Reddy: తెలంగాణలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. డిజిటల్ హెల్త్ కార్డుల రూపకల్పనలో ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని కోరారు.
ప్రముఖ దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు. ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియెంటెడ్ ప్రభుత్వం కాదన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని వివరించారు.
హెల్త్ ప్రొఫైల్ కార్డుల ప్రక్రియలో సహకారానికి సంబంధించి సామాజిక బాధ్యత కలిగిన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ లాంటి సంస్థలతో త్వరలోనే ఒక భేటీ ఏర్పాటు చేయాలని సీఎం మంత్రికి సూచనలు చేశారు. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స పేదలకు భారమవుతోందని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ, హాస్పిటల్ సేవల విస్తరణపై యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అమలుకు ప్రయత్నిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్
YS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసా?
Esther Anil: దృశ్యం చిన్నది.. గ్లామర్‌తో కవ్విస్తున్నది
