HomeCinemaJr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసా? 

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసా? 

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర (Devara) రేపు రిలీజ్ అవుతోంది. ప్రమోషన్లలో ఎన్టీఆర్ (NTR), హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దర్శకుడు కొరటాల శివ బిజీగా గడుపుతున్నారు. అయితే, తాజాగా ఓ ఫన్ ప్రోగ్రామ్ లో (ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో) జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనకు ఇష్టమైన కథానాయికపై మనసులో మాట చెప్పాడు.

దక్షిణాదిలో తను శ్రీదేవి ఫేవరెట్ హీరోయిన్ అని ఎన్టీఆర్ చెప్పాడు. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది. జాన్వీ గురించి ఎన్టీఆర్ ఓ చాడీ చెబుతూ ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి భోజనం తినిపించానన్నాడు. అయితే, ముంబై వచ్చినప్పుడు ఆమె ఒక్కసారి కూడా ఇంటి భోజనం కానీ, హోటల్ ఫుడ్ కానీ పంపలేదని జోక్ చేశాడు. దీంతో జాన్వీ నవ్వేసింది. ఈ కార్యక్రమం ఫుల్ వీడియో ఎపిసోడ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్‌ 28న ప్రసారం కానుంది.

దివంగత నటి శ్రీదేవిది సౌత్‌ అయితే ఆమె భర్త బోనీకపూర్‌ది నార్త్‌ అని తెలిసిందే. దీంతో ఉదయం అల్పాహారం చేసేటప్పుడు అమ్మ ఎప్పుడూ నాన్నతో గొడవపడేదని జాన్వీ ఈ కార్యక్రమంలో చెప్పింది. ఉదయం ఆలూ పరాటా తినే నాన్న… అమ్మ వల్ల ఇడ్లీ సాంబార్‌ అలవాటు చేసుకున్నాడని తెలిపింది. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ నార్త్‌ ఇండియన్‌లా గొడవపడేదని తెలిపింది.

ఇవీ చదవండి: Jr NTR: తమిళ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
Devara Trailer: దేవర ట్రైలర్ రిలీజ్.. కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చింపేశాడ్రోయ్!
Devara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?
Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?
Game Changer: గేమ్ ఛేంజర్ అప్ డేట్.. రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..
RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు