Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిపై పెట్టిన స్పెషల్ ఫోకస్.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చిచ్చు రాజేస్తోంది. అమరావతిని అభివృద్ధి చేయడం అటుంచితే.. రాయలసీమలో ఉన్న, కేటాయించిన ప్రతిష్టాత్మక సంస్థలను అమరావతికి తరలించాలని ప్రయత్నాలు చేయడం ఇప్పుడు పొలిటికల్ కాక రేపుతోంది. ఈ దిశగా ఇప్పటికే కర్నూలుకు మంజూరైన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని అమరావతిలో కట్టాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. అలాగే తాజాగా కొప్పర్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ను అమరావతికి తరలించేలా ఉతర్వులిచ్చారు.
వైయస్సార్ జిల్లాపై, రాయలసీమపై చంద్రబాబు కక్ష సాధింపునకు దిగారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి సెజ్‌లో కేంద్రం కేటాయించిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతి తీసుకెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వంలో కొప్పర్తి నార్త్ బ్లాక్‌లో 19.5 ఎకరాల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మారిపోయి కూటమి సర్కార్ కొలువుదీరిన నేపథ్యంలో కొప్పర్తికి మంజూరైన టెక్నాలజీ సెంటర్‌ను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకెళ్తూ సర్కార్ జీవో జారీ చేసింది.
టెక్నాలజీ పార్క్ వల్ల యువతకు స్కిల్ ట్రైనింగ్, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాలు సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. కడప యువత అవకాశాలను చంద్రబాబు నిర్ణయం దారుణంగా దెబ్బతీస్తుందని నిపుణులు వాపోతున్నారు. జీవో నంబర్ 56ను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
మరోవైపు కర్నూలుకు కేంద్రం మంజూరు చేసిన లా యూనివర్సిటీతోపాటు అక్కడ ఇప్పటికే కొలువుదీరిన వివిధ న్యాయ సంస్థలను అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయ్యింది.
ఇప్పటికే జగన్ ప్రభుత్వం మొదలు పెట్టిన పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దు అంటూ కేంద్రానికి చంద్రబాబు సర్కార్ లేఖ రాసింది. ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసినా కేవలం జగన్ కు పేరొస్తుందనే అక్కసుతో చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు ఒడిగట్టారంటూ వైయస్సార్ సీపీ ఆరోపిస్తోంది.
2014 -19 మధ్య కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో కెల్లా పెద్దది అయిన AIIMS అనంతపురానికి కేటాయిస్తే తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకున్నారంటూ ఇప్పటికే చంద్రబాబుపై అపవాదు ఉంది. ఇక తిరుపతిలో HCL ఏర్పాటు చేస్తామని ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చిన సందర్బంగా ప్రకటిస్తే శివనాడార్‌పై నాటి సీఎం బాబు ఒత్తిడి తెచ్చి విజయవాడలో పెట్టించారన్న ఆరోపణలున్నాయి.
సీమపై తొలి నుంచి కపటప్రేమ
కరువుకు నిలయమైన రాయలసీమకు తాగు, సాగునీరు అందించాలని 2007-08లో సీఎం వైయస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడానికి చర్యలు తీసుకుంటే.. చంద్రబాబు ఓర్వలేకపోయారని వైయస్సార్ సీపీ గుర్తు చేస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు దేవినేని ఉమ, కోడెల శివప్రసాదరావు తదితరులతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసేలా ఉసిగొల్పారని చెబుతున్నారు.
ఇక శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటిమట్టం ఉన్నా తెలంగాణ మాదిరిగానే నీళ్లు తోడుకునేందుకు పోతిరెడ్డిపాడుని 80 వేల క్యూసెక్కులకు పెంచి సీమ దాహార్తిని తీర్చేలా రూ.3,825 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తి పోతల పథకాన్ని వైయస్ జగన్ మొదలు పెడితే ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ ఆ జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు గ్రీన్ ట్రిబ్యునల్ కు లేఖ రాయించారని వైయస్సార్ సీపీ గుర్తు చేసింది.
Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది
Ghee Test: నెయ్యి నాణ్యత నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
Tirumala: కలి ప్రభావం.. అప్పుడే ఏమైంది..? ఇంకా మున్ముందు చాలా చూడాలి భక్తులారా…!
Vetrimaaran: ఎన్టీఆర్‌కు వెట్రిమారన్ కథ వినిపించారా?
