Harsha Sai: తెలుగులో టాప్ మోస్ట్ యూట్యూబర్లలో ఒకడైన హర్ష సాయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. తనపై అత్యాచారం చేసి, నగ్న చిత్రాలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ హర్ష సాయి (Harsha Sai)పై సినీ నటి ఒకరు ఫిర్యాదు చేశారు. ఆమె ఆరోపణలపై హర్ష సాయి రియాక్ట్ అయ్యాడు.
అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ తన ఇన్ స్టా గ్రామ్ (Harshasai Instagram) వేదికగా పోస్టు చేశాడు. ‘‘ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బు కోసమే ఇదంతా జరుగుతోంది. మీకు నా గురించి తెలుసు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి’’ అని ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని తన తరఫు ఉన్న లాయర్ చూసుకుంటాడని చెప్పాడు.
సినిమాల్లో అవకాశాల కోసం తాను ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు ఆ నటి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే తాను ఒక రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేశానని, అనంతరం ఓ ప్రైవేటు పార్టీలో హర్ష సాయితో తనకు పరిచయం అయ్యిందని తెలిపింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి హర్ష సాయి అత్యాచారం చేశాడని, భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది. దీంతో హర్షసాయిపై పోలీసులు అత్యాచారం కేసు రిజిస్టర్ చేశారు.
