Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ విషయాల్లో ఆయన సలహాదారుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర ప్రాజెక్టు గేట్ ఏర్పాటు ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలకపాత్ర పోషించారని ప్రభుత్వం తెలిపింది. ఏపీలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల విషయమై ప్రభుత్వం ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఆయన సేవలను వినియోగించుకోనుంది.
ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు సహా గేట్ల నిర్వహణ విషయంలో కన్నయ్య సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ బిగింపునకు కన్నయ్య అందించిన సేవలను గుర్తించి ఇటీవలే సీఎం చంద్రబాబు సన్మానించిన సంగతి తెలిసిందే.
Read also: Operation YSRCP: వైసీపీని ఖాళీ చేయించే దిశగా టీడీపీ చీఫ్ అడుగులు.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్!
Polavaram: పోలవరానికి రూ.12,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత
Ashwini Vaishnaw: ఏపీకి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్ న్యూస్..
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలకు ఆమోదం
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేందిరబై..!
