AP Liquor Policy: రాష్ట్రంలో నూతన మద్యం విధానం రూపకల్పనకు కేబినెట్ సబ్‌కమిటీ నియామకం జరిగింది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కెబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని కెబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది.
పలు రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేయనున్నారు. మద్యం దుకాణాలు, బార్లు, బెవరేజెస్ కంపెనీల వంటి వాటిల్లో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న పద్ధతులను గమనిస్తారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను నిశితంగా గమనిస్తారు. మద్యం విధాన రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి మంత్రి వర్గ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరిస్తుంది.
Read also: Andhra Pradesh: ఏపీ జలవనరుల శాఖ సలహాదారుగా కన్నయ్య నాయుడు
Operation YSRCP: వైసీపీని ఖాళీ చేయించే దిశగా టీడీపీ చీఫ్ అడుగులు.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్!
Polavaram: పోలవరానికి రూ.12,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలకు ఆమోదం
