HomeAndhra PradeshOperation YSRCP: వైసీపీని ఖాళీ చేయించే దిశగా టీడీపీ చీఫ్ అడుగులు.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్!

Operation YSRCP: వైసీపీని ఖాళీ చేయించే దిశగా టీడీపీ చీఫ్ అడుగులు.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్!

Operation YSRCP: ఏపీలో ప్రతిపక్షం పాత్ర లేకుండా చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేగంగా వేస్తోంది. ఇందులో భాగంగా మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నోట్ల కట్టల బ్యాగులతో దొరికిపోయిన ఉదంతం తెలిసిందే. రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం తరతరాలుగా వస్తున్నదే. అయితే, అలా లాగేసుకున్న పార్టీలకు తర్వాతి కాలంలో అదే పరిస్థితి ఎదురు కావడం చూస్తూనే ఉన్నాం. కానీ పార్టీల ఆలోచనలు మాత్రం మారడం లేదు.

ఇందుకు ఉదాహరణగా.. పలు ఘటనలు చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో ఏపీలో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వం.. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, పలువురు ఎంపీలను లాగేసుకుంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లే దక్కాయి. మరోవైపు తెలంగాణలో ఏకంగా కాంగ్రెస్ శాసనసభా పక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్న పరిస్థితులు చూశాం. తర్వాత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పరాభవం తప్పలేదు.

ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. మరోవైపు ఏపీలోనూ ఇదే ట్రెండ్ కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. విలువలు పాటిస్తామంటూనే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని లాగేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలకు గాలం వేశారు. పోతుల సునీత ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు.

తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు. అలాగే వైసీపీకి కూడా రాజీనామా చేశారు. టీడీపీలో చేరుతామంటూ క్లారిటీ ఇచ్చారు. తద్వారా రాజ్యసభలో జీరోగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఖాతా తెరిచే చాన్స్ ఉంది. వీరితో రాజీనామా చేయించిన అనంతరం ఎన్నికలు వస్తే టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునేలా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: Polavaram: పోలవరానికి రూ.12,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత
Ashwini Vaishnaw: ఏపీకి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్ న్యూస్..
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలకు ఆమోదం
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేందిరబై..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు