HomeLife StyleBlood Tests: మీకు 25 ఏళ్లు దాటాయా? అయితే ఈ 6 టెస్టులు తప్పనిసరి!

Blood Tests: మీకు 25 ఏళ్లు దాటాయా? అయితే ఈ 6 టెస్టులు తప్పనిసరి!

Blood Tests: పాతికేళ్లు దాటిన యువతీ యువకులు ఏటా 6 టెస్టులు చేయించుకోవాలట. ఇలా చేయడం వల్ల జీవితాంతం హ్యాపీగా గడపొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ టెస్టులు ఏంటి?

నేటి కాలంలో మనిషి ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మన ఆరోగ్యంపై ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మారిన జీవన సరళి, అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల అనునిత్యం వ్యాధుల బారిన పడే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ కోణంలోమీరు ఎప్పటికప్పుడు కొన్ని పరీక్షలు చేయించుకుంటే.. చాలా రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి 25 సంవత్సరాల వయసు తర్వాత ఏటా ఈ 6 టెస్ట్ లు తప్పనిసరిగా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

1. వృషణ పరీక్ష (Testicular test)
వృషణ క్యాన్సర్ కేసులు 15 నుంచి 35 సంవత్సరాల వయసు గల పురుషుల్లో అధికంగా నమోదవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి పురుషుడు సంవత్సరానికి ఒకసారి వృషణ పరీక్ష చేయించుకోవాలట. దీన్ని డాక్టర్ స్వయంగా చేసి వృషణాలను తాకడం ద్వారా ఏదైనా గట్టిదనం లేదా గడ్డ ఉందా అనే విషయం గమనిస్తారు. వృషణాల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే 95 శాతం కేసుల్లో ఇది నయం అవుతుంది.

2. సీబీసీ (CBC)
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం CBC అంటే పూర్తి రక్త పరీక్ష. ఇందులో రక్తంలో ఏయే విషయాలు పెరిగాయో సులభంగా తెలిసిపోతుంది. ఉదాహరణకు మధుమేహం పెరిగినట్లయితే లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో KFT అంటే మూత్రపిండాల పనితీరు పరీక్ష, LFT అంటే కాలేయ పనితీరు టెస్ట్ చేస్తారు. ఇది మూత్రపిండాలు, కాలేయం ఎలా పని చేస్తుందనే దాని గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ టెస్ట్ కూడా ఏడాదికోసారి చేయించుకోవడం బెటర్.

3. బీపీ పరీక్ష (BP Test)
బీపీ పరీక్ష చేయించుకోవడం చాలా ఈజీ కానీ చాలా మంది ఈ టెస్ట్ చేయించుకోవడానికి ఇష్టపడరు. తమకు రక్తపోటు ఉండదని సాధారణంగా చాలామంది అనుకుంటారు. కానీ 25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

4. హార్ట్ బీట్ రేటు (Heart beat rate)
గుండె చాలా వేగంగా లేదా చాలా స్లోగా కొట్టుకుంటున్నట్లయితే గుండెకు సంబంధించిన ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అందుచేత గుండె చప్పుడును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. తక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలి.

5. కోలన్ క్యాన్సర్ టెస్ట్ (colon cancer test)
25 ఏళ్లు నిండిన తర్వాత కోలన్ క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి. కడుపు సంబంధిత వ్యాధి ఉన్నట్లయితే లేదా మల విసర్జనకు సమస్యగా ఉంటే ఈ టెస్ట్ లో బయటపడుతుంది.

6. కంటి పరీక్ష (Eye Test)
25 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కంటి పరీక్ష చేసుకోవాల్సిన సమయం కూడా వస్తుంది. అందుకే మీ కళ్లను తరచూ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. ఈరోజుల్లో చాలామంది చిన్నప్పటి నుంచి కళ్లద్దాలు వాడుతుంటారు. కంటి చూపు మందగించిందని ఏ మాత్రం సందేహం కలిగినా ఒకసారి కళ్లను పరీక్ష చేయించుకోవాలి.

ఇవీ చదవండి: Black Rice: బ్లాక్ రైస్ తింటే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని మీకు తెలుసా?
Child Care: చిన్నారుల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపాలి?
Sabja Ginjalu: పరగడుపున సబ్జా గింజలతో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పదిలం!
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్
Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు