Galla Madhavi: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్ర రావు తాజాగా వార్తల్లోకెక్కారు. తన రియల్ ఎస్టేట్ కోసం భూమి అమ్మలేదన్న కారణంతో ఓ కుటుంబంపై దాడికి దిగారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి,. దాంతో వ్యవహారం ముదిరి కోర్టు వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేశారు. గుంటూరు తెలుగుదేశం పార్టీలో ఈ వ్యవహారం కలకలం రేపింది.
పోలీసుల సమక్షంలోనే ఈ దాడి చేసినా చర్యలు లేవని బాధితులు మండిపడ్డారు. ప్రస్తుతం నిందితుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల వేధింపులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ షాప్ వ్యవహారంలో మనీషా అనే యువతిని తెలుగుదేశం నాయకుడు వెంకటేశ్వర్లు వేధిస్తున్నట్లు విమర్శలొచ్చాయి. వేధింపులతో పాటు మనీషాను వెంకటేశ్వర్లు తీవ్రంగా అవమానించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తన చావుకి కారణం వెంకటేశ్వర్లు అంటూ లెటర్ రాసి మనీషా వెళ్లిపోయింది. మనీషా చున్నీ, చెప్పులను గ్రామంలో కాలువ దగ్గర గ్రామస్తులు గుర్తించారు. మనీషా ఆచూకీ కోసం ఆమె కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. పిడుగురాళ్ల మండలం జూకల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read also: Blood Tests: మీకు 25 ఏళ్లు దాటాయా? అయితే ఈ 6 టెస్టులు తప్పనిసరి!
Problems: అష్టకష్టాలు అంటే ఏమిటి? అవి ఎలా ఉంటాయో తెలుసా?
NHRC: ఏపీలో 2 ఘటనలపై ఎన్‌హెచ్ఆర్‌సీ నజర్.. సుమోటోగా విచారణ
Jobs: టెక్నాలజీ పెరిగినా ఈ రంగాల్లో మెండుగా ఉద్యోగాలు!
