HomeAndhra PradeshNHRC: ఏపీలో 2 ఘటనలపై ఎన్‌హెచ్ఆర్‌సీ నజర్.. సుమోటోగా విచారణ

NHRC: ఏపీలో 2 ఘటనలపై ఎన్‌హెచ్ఆర్‌సీ నజర్.. సుమోటోగా విచారణ

NHRC: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార విషప్రయోగం జరిగిన రెండు వేర్వేరు సంఘటనలల్లో ముగ్గురు పిల్లల ప్రాణాలను బలిగొన్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది. ఆయా ఘటనల్లో అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. రెండు వేర్వేరు సంఘటనలను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్ఆర్సీ.. విచారణకు ఆదేశించింది.

ఏపీలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమైన ఫుడ్ పాయిజనింగ్ రెండు సంఘటనల గురించి ఆగస్టు 19, 21వ తేదీల్లో ప్రసారమైన మీడియా నివేదికలను NHRC పరిగణలోకి తీసుకుంది.

NHRC విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్శిటీలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 70 మంది విద్యార్థుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైంది. వారు చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఘటనలో అనకాపల్లి జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్‌ పాయిజన్‌తో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 37 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని అనకాపల్లి, విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు.

ఆయా వార్తా నివేదికల్లోని అంశాలు నిజమైతే, బాధితుల మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యను లేవనెత్తుతున్నాయని కమిషన్ పేర్కొంది. రెండు ఘటనలు సరైన ఆహార నాణ్యత, బాధితుల ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయని తెలిపింది.

రెండు వారాల్లోగా రెండు ఆయా విషయాలపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎఫ్‌ఐఆర్‌ల స్థితి, బాధితుల ఆరోగ్య స్థితిని వెల్లడించాలని తెలిపింది. అటువంటి బాధాకరమైన ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తీసుకున్న/ప్రతిపాదించిన చర్యలను కూడా నివేదికలో పేర్కొనాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: Jobs: టెక్నాలజీ పెరిగినా ఈ రంగాల్లో మెండుగా ఉద్యోగాలు!
Diabetes: మధుమేహం ఉందా? రోజూ 45 నిమిషాల పాటు ఇలా చేయండి
Pawan Kalyan: ఒకే రోజు 13,326 గ్రామ సభలు.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
YS Jagan: వక్ఫ్ బిల్లుకు మేం వ్యతిరేకం.. వైయస్ జగన్ క్లారిటీ
Vijay: సమానత్వాన్ని బలంగా సమర్థిస్తాం.. పార్టీ లోగో, ఫ్లాగ్ ఆవిష్కరణలో హీరో విజయ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు