AP Employees: ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పునర్విభజనతో 26 జిల్లాలుగా మారిన సంగతి తెలిసిందే. జిల్లాలు పెరగడంతో ఇప్పుడు ఒక్కో జోన్‌లో 7 నుంచి 8 జిల్లాలు వచ్చాయి. జోన్ల సంఖ్యను 6 లేదా ఇంకా ఎక్కువకు పెంచాలని ప్రతిపాదన తెస్తున్నట్లు సమాచారం. (AP Employees)
Read Also : PRC Commission: ఏపీలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు.. ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఇదేశం
గతంలో 6 పాయింట్ ఫార్ములాకు అనుబంధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై డ్రాప్ట్ ప్రతిపాదనలను కమిటీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సర్వీసెస్ కార్యదర్శి భాస్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనపై అభిప్రాయాలను ఉద్యోగులు తెలిపినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సర్వీసు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. బదిలీల్లో ఉద్యోగుల నుంచి ఆప్షన్ తీసుకోవాలని ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయి.
Read Also : UnEmployment: జాబ్‌లెస్ లైఫ్.. ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా 8% దాటిన నిరుద్యోగిత రేటు..!