HomeInternationalParaguay Swimmer Luana: అందం తెచ్చిన తంటా.. ఒలింపిక్స్ నుంచి పంపేశారు!

Paraguay Swimmer Luana: అందం తెచ్చిన తంటా.. ఒలింపిక్స్ నుంచి పంపేశారు!

Paraguay Swimmer Luana: ఆడవాళ్లు అందానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అన్ని హంగులతో ముస్తాబైతేనే చూడచక్కగా ఉంటారు. అయితే, ఆ అందమే కొందరికి శాపంగా మారుతుంటుంది. ఒలింపిక్స్ లో కూడా ఇదే జరిగింది.

పరాగ్వేకు చెందిన 20 ఏళ్ల స్విమ్మర్ లువానా అలోన్సో అందంతో తోటి క్రీడాకారులకు ఇబ్బందులకు గురి చేసినందుకు ఒలింపిక్స్ నుంచి పంపేశారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో, అలోన్సో మహిళల 100 మీటర్ల బటర్‌ఫ్లై సెమీ-ఫైనల్‌కు కేవలం 0.24 సెకన్ల తేడాతో అర్హత కోల్పోయింది.

ఆమె అందంగా ఉంటూ జట్టు సభ్యులకు ఫోకస్ దెబ్బతినేలా చేస్తోందని పరాగ్వే ఒలింపిక్ కమిటీ బాస్ లారిస్సా స్కేరర్ ప్రకటన విడుదల చేశారు. ఆమె ప్రవర్తన దేశ ఒలింపిక్ నాయకత్వాన్ని కలవరపెట్టిందని పేర్కొన్నారు. జూలై 27న జరిగిన మహిళల 100 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్ ఈవెంట్‌ను అధిగమించడంలో విఫలమైన తర్వాత ఆమె స్విమ్మింగ్ కు రిటైర్ మెంట్ ప్రకటించింది.

లువానా అలోన్సో ఎవరు?

2004 సెప్టెంబరు 19న జన్మించిన లువానా అలోన్సో, పరాగ్వేకు చెందిన స్విమ్మర్. బటర్‌ఫ్లై స్ట్రోక్ ఈవెంట్‌లలో నైపుణ్యం కలిగి ఉంది. 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో పరాగ్వే తరఫున ఆమె జాతీయ రికార్డు హోల్డర్.

అలోన్సో ప్రస్తుతం యూఎస్ డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్. యూనివర్సిటీ మహిళల స్విమ్మింగ్ మరియు డైవింగ్ టీమ్‌తో ఆమె సమయానికి ముందు, ఆమె ఒక సెమిస్టర్ కోసం వర్జీనియా టెక్‌లో భాగమని US వీక్లీ మ్యాగజైన్ నివేదించింది.

ఆమె 17 సంవత్సరాల వయసులో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తన దేశానికి మొదటిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఆమె వెలుగులోకి వచ్చింది. అప్పటికి ఆమె 28వ స్థానంలో నిలిచింది. సెమీఫైనల్‌కు వెళ్లడంలో విఫలమైంది.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో, ఆమె రెండోసారి కనిపించింది. కానీ ఆరో స్థానంలో నిలిచిన తర్వాత హీట్స్‌లో ఎలిమినేట్ అయింది. అంతకు ముందు ఆమె యూత్ ఒలింపిక్ గేమ్స్, సౌత్ అమెరికన్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కూడా పాల్గొంది.

ఒలింపిక్స్‌కు ముందు అలోన్సో కు 2024 ఒలింపిక్స్‌లో యునైటెడ్ స్టేట్స్‌కు ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఉండేదట. వేసవి ఒలింపిక్స్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమ్‌లో, ఆమె పరాగ్వే కంటే యుఎస్‌ను ఇష్టపడతానని చెప్పింది.

ఒలింపిక్స్ నుంచి పంపేయడంపై ఆమె వివరణ ఇచ్చారు. తనను ఎవరూ ఎక్కడి నుంచి కూడా బహిష్కరించలేదని క్లారిటీ ఇచ్చారు. దయచేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆపాలని కోరారు. దీనిపై స్పందించకూడదనుకున్నానని, అబద్ధపు ప్రచారాలు తనను ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: Iraq: ఆ దేశంలో అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చట!
Pushpa 2 Update: పుష్ప 2 మూవీ లేటెస్ట్ అప్ డేట్.. మళ్లీ వాయిదా వేసేదే లే!
Tripti Dimri: బాలీవుడ్‌లో ఎంత మంది అందగత్తెలున్నా.. త్రిప్తి డిమ్రీ అందం వేరయా!
తరగని అందం.. దక్ష నాగర్కర్‌
బెస్ట్‌ డిజైనర్‌ డ్రస్‌ సినిశెట్టి అందం
Nikki Tamboli: శిల్పం లాంటి అందం.. నిక్కీ తంబోలి ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు