HomeInternationalIraq: ఆ దేశంలో అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చట!

Iraq: ఆ దేశంలో అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చట!

Iraq: చాలా దేశాల్లో నేటికీ బాల్య వివాహాలు అనధికారికంగా జరుగుతున్నాయని వార్తల్లో చూస్తుంటాం. పలు దేశాల్లో అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయిల పెళ్లి వయసు 21 సంవత్సరాలు ఉంది. అయితే, బాల్య వివాహాలు జరగడం ఒక అంశం అయితే, మూడు పదుల వయసు దాటినా ఇప్పటి కాలంలో చాలా మంది యువతీ యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఆర్థికంగా సెటిల్ కాకపోవడం, ఉద్యోగాలు చేస్తూ ఉండిపోవడం, ఉద్యోగాలు రాక మరికొందరు పెళ్లిని వాయిదా వేయడం జరుగుతున్నాయి. తాజాగా ఇరాక్ దేశం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇరాక్ దేశంలోని అమ్మాయిల పెళ్లి వయసు (Legal Age Of Marriage For Girls)పై అక్కడి పార్లమెంట్‌లో (Iraq) ప్రభుత్వం కీలక బిల్లును ప్రతిపాదించింది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల వివాహ వయసును 9 సంవత్సరాలకు కుదించాలంటూ సదరు బిల్లులో పేర్కొనడం వివాదాస్పదమవుతోంది. ఈ బిల్లును ఇరాక్‌ న్యాయ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది. పర్సనల్‌ స్టేటస్ లా ను సవరించే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది.

ఇప్పటి రూల్స్ ప్రకారం ఇరాక్‌లో వధువు వివాహ వయసు 18 ఏళ్లు. కొత్త బిల్లు పాస్ అయిన పక్షంలో బాలికలు 9 సంవత్సరాలకు, బాలురు 15 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా చట్టం అనుమతిస్తుంది. అయితే, ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లింగ సమానత్వం, మహిళల హక్కులను కాలరాసినట్లవుతుందంటున్నారు మేధావులు.

ఇరాక్ తీసుకువచ్చిన ఈ బిల్లును మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అమ్మాయిల విద్య, ఆరోగ్యంపై ఇది తీవ్రంగా ఎఫెక్ట్ చూపుతుందని చెబుతున్నారు. చదువు మధ్యలోనే ఆపేసేలా చేస్తుందని, చిన్న వయసులోనే బాలికలు గర్భం దాల్చితే జీవితం దుర్భరంగా మారుతుందంటున్నారు. గృహహింస లాంటివి పెరుగుతాయంటున్నారు.

యూనిసెఫ్ లెక్కల ప్రకారం.. ఇరాక్‌లో ఇప్పటికే 28 శాతం మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరిగిపోతున్నాయట. గతంలో ఇరాక్ పార్లమెంట్ వేదికగా వివాహ వయసు కుదించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ తీవ్రంగా అన్ని వర్గాలూ వ్యతిరేకించడంతో అప్పటికి వాయిదా పడింది. తాజాగా ఈ బిల్లు మరోసారి చట్టసభ ముందుకు వచ్చింది.

ఇవీ చదవండి: Aditi Rao Hydari And Siddharth: అదితి రావ్‌ హైదరి, సిద్ధార్థ్.. పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు!
Magha Masam Marriages: మాఘమాసం పెళ్లిళ్ల సీజన్‌ షురూ.. మాఘమాసం విశిష్టతలు ఇవీ..
China President: చైనాలో ముందెన్నడూ లేని వింత పరిస్థితి.. యువతులు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ అధ్యక్షుడి వేడుకోలు
Vizag Love story: ఒకేసారి ఇద్దరితో యువతి ప్రేమ.. వేరొకరితో పెళ్లి.. తర్వాత కూడా యువకులతో చనువుగా.. సీన్‌ కట్‌ చేస్తే..!
Brother’s Marriage: అన్నదమ్ములు ఒకేసారి పెళ్లిళ్లు చేసుకోవచ్చా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు