HomeAndhra PradeshYS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ...

YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…

YS Sharmila Reddy: ’’జగన్ కాంగ్రెస్ తో చర్చలు అనేది అబద్ధం. ఇందులో వాస్తవం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. పిల్ల కాలువలు అని ఎప్పటికైనా సముద్రంలో కలవాలి. జగన్ వస్తే బాగుండు అని చెప్పుకుంటున్నారు. జగన్ మళ్ళీ ఎందుకు రావాలో చెప్పాలి. మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పులు చేయడానికి రావాలా ? పోలవరం తో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా ? మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్ళీ రావాలా ? ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే రిపేర్లు లేవు…ఇందుకే జగన్ మళ్ళీ రావాలా ? ధర స్థిరీకరణ నిది అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలా ? జగన్ మళ్ళీ అధికారంలో రాడు. వైసిపి ఎన్నటికీ అధికారంలో రాదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదు ? భారీ మెజారిటీ తో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదు ? బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మ ను అవమానించాడు. 11 సీట్లకు పరిమితం అయ్యారు… ఇప్పుడు ఒక్క సీట్ తో పండుగ చేచేసుకోండి.’’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.

ఆరోగ్య శ్రీ ఇక నడపలేం అని ఆసుపత్రులు చెప్తున్నాయిని, దీనికి మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. సూదికి, దూదికి డబ్బుల్లేవు అని ఆస్పత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆసుపత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

పెండింగ్ బిల్లులు చెల్లించక ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకం వైయస్సార్ ప్రవేశ పెట్టిన పథకం అని, ఈ పథకం వైద్య విధానంలో ఈ దేశానికి ఆదర్శం అన్నారు. ఎన్నో రాష్ట్రాలు ఆరోగ్య శ్రీ పథకాన్ని కాపీ కొట్టాయన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు చెల్లింపులు నిలిచి పోయాయన్నారు.

’’జగన్ హయంలో దాదాపు 16 వందల కోట్లు పెండింగ్ లో పెట్టారు. దాదాపు 11 నెలలుగా ఒక్క రూపాయి చెల్లించలేదు. ఆరోగ్య శ్రీ సీఈఓ దగ్గరకు వెళ్లి గోడు వెళ్ళబోసుకున్నా నిధులు విడుదల చేయడం లేదు. ఆరోగ్య శ్రీ నిలిపి వేయడం పై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు అన్నారు. బాబు భవిష్యత్ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పారు. ఇవ్వాళ రాష్ట్రం ఆరోగ్య శ్రీ కి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి లో ఉంటే ఎలా ?

ఆరోగ్య శ్రీ పథకాన్ని పథకం గానే చూడండి. ఎవరు ప్రవేశ పెట్టారు అని చూడకండి. ఆరోగ్య శ్రీ తో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ కి నిధులు కొరత ఉంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని జగన్ సైతం నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రక్షించండి. ఆసుపత్రులు యాజమాన్యాలను చర్చలకు పిలవండి. ఎంతో కొంతో తక్షణం పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయండి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఉదృతం చేస్తుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోతే 25 మంది ఎంపీలు బీజేపీకి ఎందుకు ఊడిగం చేస్తున్నట్లు ? మీ మద్దతుతోనే కదా మోడీ గద్దెను ఎక్కింది ? నిధులు కావాలని వెంటనే డిమాండ్ చేయండి.

చంద్రబాబు సూపర్ సిక్స్ అని ఊదర గొట్టారు. రెండు నెల్లు దాటినా ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదు. వెంటనే అమలు చేయండి అని మేము ఏమి అడగడం లేదు. కానీ కనీసం కొన్ని పథకాలు అయినా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రతి తల్లికి ఎంత మంది బిడ్డలు అంటే అన్ని 15 వేలు ఇస్తామని చెప్పారు. జూన్,జూలై లోనే తల్లులకు నిధులు ఇవ్వాలి. కానీ అసలు ఈ పథకం ఇప్పుడు అమలు అవుతుందా లేదా అనే అనుమానం ఉంది.’’ అని షర్మిల కామెంట్స్ చేశారు.

ఇవీ చదవండి: YS Jagan in Kadapa: కడపలో సీఎం జగన్ ఎమోషనల్‌.. షర్మిలపై కీలక వ్యాఖ్యలు!
Star Campaigners of Babu: బాబును జాకీలు పెట్టి లేపే స్టార్‌ క్యాంపెయినర్లు.. షర్మిలపై సీఎం జగన్‌ పరోక్ష సెటైర్లు
YSRCP vs Sharmila: అన్న జగన్‌పై కామెంట్స్‌తో దూకుడు పెంచిన షర్మిల? వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియాను తట్టుకోగలరా?
Sajjala comments on Sharmila: షర్మిల మాట్లాడిన భాష, హడావుడి చూస్తే జాలి కలుగుతోంది..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు