HomeAndhra PradeshYSRCP MLC: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స

YSRCP MLC: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స

YSRCP MLC: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. ఇవాళ క్యాంప్‌ ఆఫీస్‌లో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిపై నేతలతో అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొత్స పేరును ఖరారు చేశారు.

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన జగన్ తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.

విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీ పోటీకి పెట్టకూడదని, కానీ చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదని జగన్ అభిప్రాయపడ్డారు. రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో అడ్డగోలుగా గెలవడానికి బాబు ప్రయత్నిస్తారన్న జగన్.. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఉన్నిక జరగబోతోందని, అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

అనంతరం అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని జగన్ కోరారు. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్దేశించారు. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని, వాటిని ధీటుగా ఎదుర్కొనేలా అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు జగన్.

ఇవీ చదవండి: Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్‌ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
Botcha: పీకే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు: మంత్రి బొత్స
YSRCP Manifesto 2024: మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదలలో జగన్‌
YSRCP Manifesto: వైయస్సార్‌ సీపీమేనిఫెస్టో రిలీజ్.. సీఎం జగన్‌ కామెంట్స్‌ ఇవీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు