Job Calendar: ఉద్యోగాల కోసం ఎదరు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా జాబ్ కేలండర్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ కేలండర్ డీటెయిల్స్ ను వివరించారు. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలన్న అంశాలను కేలండర్ లో వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువరించే నెల, ఎగ్జామ్స్ నిర్వహించే డీటెయిల్స్ కూడా వెల్లడించారు. సదరు ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల వివరాలు తెలిపారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్ లో, గ్రూప్-2 పరీక్సలు డిసెంబర్ లో, గ్రూప్-3 ఎగ్జామ్స్ నవంబర్ లో చేపడతారు. వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వెలువరించనుంది తెలంగాణ ప్రభుత్వం. పరీక్షలు ఆ తర్వాతి మాసం నవంబర్ లో చేడపతారు.
మరోవైపు ట్రాన్స్‌కోలోని పలు ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇస్తారు. వచ్చే ఏడాది జనవరిలో వీటికి సంబంధించిన నియామక పరీక్షలు పూర్తి చేస్తారు. అలాగే టీచర్ ఉద్యోగార్థుల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ను ఈ నవంబర్ లో విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇక డీఎస్సీకి సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. పరీక్షలు ఏప్రిల్ లో ఉంటాయి.
వివిధ ప్రభుత్వ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇస్తారు. ఏప్రిల్ మాసంలో ఎగ్జామ్స్ ఉంటాయి. మరోవైపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల జాబ్ లకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువరించి మే మాసంలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జూలైలో చేపడతారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చి, ఆగస్టు మాసంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్ నెలలో నోటిఫికేషన్ ఇవ్వనుంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన పరీక్షలు సెప్టెంబర్‌లో ఉంటాయి.
ఇక వచ్చే ఏడాది మే నెలలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేస్తారు. అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే వచ్చే ఏడాది జూలైలో గ్రూప్-3 కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి, నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు సింగరేణికి సంబంధించి పలు పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది 2025 జూలైలో నోటిఫికేషన్ ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి అసెంబ్లీలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Read also: YSRCP MLC: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స
AP DSC Notification: ఏపీలో టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులంటే..
AP DCS Exam: ఏపీలో డీఎస్సీ పరీక్ష వాయిదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే..
AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు
Software Employees: రోజుకు 16 గంటల పని.. సాఫ్ట్ వేర్ పిల్లల నడుములు వంగిపోతున్నాయ్..
