HomeBusinessAirtel: మోత మోగించిన ఎయిర్‌టెల్.. టారిఫ్‌లు ఎంత పెరిగాయంటే..!

Airtel: మోత మోగించిన ఎయిర్‌టెల్.. టారిఫ్‌లు ఎంత పెరిగాయంటే..!

Airtel: ప్రముఖ నెట్‌వర్క్‌ సంస్థలైన జియో, ఎయిర్‌ టెల్‌ తమ వినియోగదారులపై మరోసారి భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. జియో రీచార్జ్‌ టారిఫ్‌లు పెంచిన వెంటనే ఎయిర్‌టెల్‌ కూడా టారిఫ్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తమ మొబైల్ సేవల టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్‌ శుక్రవారం పేర్కొంది. జూలై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 10-21% వరకు ఉన్నట్లు తెలిపింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం (ARPU) రూ.300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించింది.

మెరుగైన సేవలట!
టారిఫ్‌లు పెంచిన తరుణంలో తద్వారా వచ్చే ఆదాయాన్ని తమ సేవలు మరింత మెరుగుపరిచేందుకు వినియోగిస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. పెంపు రోజుకు 70 పైసల కంటే తక్కువే ఉంటుందంటూ ఊరడించే ప్రయత్నం చేసింది. ప్రీపెయిడ్‌ సహా పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల ధరల్లో కూడా మార్పులు చేసింది.

ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఎలా ఉన్నాయంటే..
* రూ.199: ఇంతకు ముందు దీని ధర రూ.179. ఇందులో 2జీబీ డేటా, అన్‌ లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 మెసేజులు ఉచితం.
* రూ.509: గతంలో ఈ ప్లాన్ ధర రూ.455గా ఉండేది. ఇది 6జీబీ డేటా, అన్‌ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు (SMS) 84 రోజుల పాటు చెల్లుబాటు.
* రూ.1,999: గతంలో రూ.1,799. ఇందులో 24జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు రోజుకు 100 SMS ఉచితం.
* రూ.299: గతంలో రూ.265గా ఉండేది. ఇది రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 28 రోజుల వ్యాలిడిటీ.

* రూ.349 ప్లాన్: ఇప్పటి దాకా దీని ధర రూ.299గా ఉండేది. రోజుకు 1.5జీబీ డేటా, అన్‌ లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100 SMSలు.
* రూ.409: ఇంతకుముందు రూ.359గా ఉంది. ఇది రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 28 రోజుల వ్యాలిడిటీ.
* రూ.449 ప్లాన్: గతంలో రూ.399గా ఉన్న ఈ ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ 100 SMSలు.
* రూ.579: ఇంతకుముందు దీని ధర రూ.479గా ఉంది. రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజులు 100 SMSలు.

* రూ.649: గతంలో రూ.549గా ఉండేది. ఇందులో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలు.
* రూ.859 : గతంలో దీని ధర రూ.719. రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 84 రోజుల వ్యాలిడిటీ.
* రూ.979 ప్లాన్: గతంలో ధర రూ.839. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 84 రోజుల పాటు రోజుకు 100 SMSలు వస్తాయి.
* రూ.3,599: ఇంతకు ముందు వరకు దీని ధర రూ.2,999. రోజూ 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 365 రోజుల వ్యాలిడిటీ.

* రూ.22 : గతంలో దీని ధర రూ.19. ఇందులో ఒకరోజు వ్యాలిడిటీతో 1జీబీ అదనపు డేటా.
* రూ.33 ప్లాన్: గతంలో రూ.29, ఒక రోజు గడువుతో 2జీబీ అదనపు డేటా.
* రూ.77 ప్లాన్: గతంలో రూ.65, ఇది బేస్ ప్లాన్ గడువు వ్యాలిడిటీతో 4జీబీ అదనపు డేటాను అందిస్తుంది.

పోస్ట్‌ పెయిడ్‌లో ఎలా ఉన్నాయంటే..
* రూ.449 : ఈ ప్లాన్ రోల్‌ఓవర్, అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో 40జీబీ డేటా.
* రూ.549: ఇది రోల్‌ఓవర్‌తో 75జీబీ డేటా, అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, 6 నెలలు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌.
* రూ.699 ప్లాన్: ఫ్యామిలీ కోసం ఈ ప్లాన్‌లో 105జీబీ డేటా రోల్‌ఓవర్, అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, 6 నెలలు అమెజాన్‌ ప్రైమ్‌, 2 కనెక్షన్‌ల కోసం వింక్‌ ప్రీమియం ఉంటాయి.
* రూ.1,199 ప్లాన్: బిగ్‌ ఫ్యామిలీస్ కోసం ఈ ప్లాన్ రోల్‌ఓవర్‌తో 190జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది పాటు, అమెజాన్ ప్రైమ్ 4 కనెక్షన్‌లకు అందుబాటులో ఉంటుంది.

ఇవీ చదవండి: Recharge Offers: బెస్ట్‌ రీచార్జ్‌ ప్లాన్స్‌ కావాలా? రూ.300లోపు ఆఫర్లు ఏవంటే..
Tollywood Dubbed Movies: టాలీవుడ్‌లో అత్యధిక ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన 5 డబ్బింగ్‌ మూవీస్‌ ఇవే!
Helicopter: హెలికాప్టర్‌ అద్దెకు తీసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి? ఎంత ఖర్చు?
Richard Mille Watch: ఏడాదికి 5,300 వాచీల తయారీ.. ఒక్క వాచ్‌ ఖరీదే రూ.38 కోట్లు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు