Recharge Offers: స్మార్ట్ ఫోన్ ఉందంటే ప్రతి నెలా రీచార్జ్ (Recharge Offers) చేసుకోవాల్సిందే. కొందరు 20 రోజులకోసారి రీచార్జ్ చేయించుకుంటూ ఉంటారు. మరికొందరు మూడు మాసాలకు సరిపడా ప్లాన్స్ ఎంచుకుంటూ రీచార్జ్ (Recharge Offers) చేస్తుంటారు. ఇక ప్రతి నెలా ఈ రీచార్జ్ గోల భరించలేని వారు ఏకంగా ఏడాదికి సరిపడా ఒకేసారి రీచార్జ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఆఫర్లతో పని లేదు. ఒకే సారి చేసుకోవడం వల్ల మంత్లీ ఇక ఆలోచన చేయాల్సిన పని ఉండదని భావిస్తుంటారు.
చాలా కాలంగా టెలికాం కంపెనీల మధ్య భారీగా పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు బాగా కలిసివస్తోందని చెప్పవచ్చు. దీంతో చౌక ప్లాన్లను ప్రవేశపెట్టడంలోనూ ఆయా కంపెనీలు పోటా పోటీగా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ.300 కంటే తక్కువ ధరలో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు బెస్ట్ ఆఫర్లను అందిస్తున్నాయి.
ఇక జియో విషయానికి వస్తే.. జియో రూ.299 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. నిత్యం 2 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. యూజర్లు మొత్తం 56 GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతో పాటు, యూజర్లకు రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా రూ.299 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. కస్టమర్లు రోజూ 1.5 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు ఇందులో బింజ్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
బెస్ట్ ఆఫర్ కోసం చూస్తున్న వారు ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ సంస్థ రూ.299 ప్లాన్‌లో కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీగా పంపుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్‌తో నిత్యం 2 GB డేటా అందుబాటులోకి వస్తుంది. ఈ ప్లాన్‌లో Xstream మొబైల్ ప్యాక్ ప్రయోజనం కూడా పొందవచ్చు. ఇది SonyLIV, Erosnow OTT ప్లాట్‌ఫాంలకు యాక్సెస్‌ను అందజేస్తుంది.
Jio Phone రూ.222 రీచార్జ్ ప్లాన్ ద్వారా రోజూ 2జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అంటే యూజర్లకు మొత్తంగా 56జీబీ డేటా లభిస్తుంది. అంతే కాకుండా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.
అన్ని Jio Phone ప్లాన్స్ లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైనది కూడా ఉంది. రీసెంట్ గా కంపెనీ ఈ ప్లాన్ ధరను పెంచింది. ఇంతకు ముందు దీని ధర రూ.749 గా ఉండేది. కానీ ఇప్పుడు కస్టమర్లు ఈ ప్లాన్ కోసం రూ.899 చెల్లించాల్సిందే. ఈ ప్లాన్ డెయిలీ డేటా లిమిట్ కాకుండా నెలవారీ డేటా లిమిట్ తో వస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 336 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతి 28 రోజులకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే పూర్తి వ్యాలిడిటీ కాల పరిమితి ముగిసే నాటికి కస్టమర్లు 24జిబి డేటా లభిస్తుంది.
Read Also : Tandoori Chicken: తందూరి చికెన్ ఫుల్‌గా తింటున్నారా? కాస్త జాగ్రత్త..!