HomeAndhra PradeshPawan Kalyan: పవన్‌.. ఏపీ రాజకీయాల్లో తుఫాన్ కావడానికి కారణాలేంటి?

Pawan Kalyan: పవన్‌.. ఏపీ రాజకీయాల్లో తుఫాన్ కావడానికి కారణాలేంటి?

Pawan Kalyan: పవన్‌ ఏపీ రాజకీయాల్లో తుఫాన్‌.. ఇంతకు మించిన ప్రశంస మరొక్కటి ఉండదు. ఈ తుఫాన్‌ కేవలం సహనంతోనే సృష్టించాడు పవన్‌. వైసీపీ అధినేత జగన్, వైసీపీ మంత్రులు ఎన్ని విమర్శలు చేసినా.. చివరికి వ్యక్తిగత జీవితంపై ఘాటు వ్యాఖ్యలు సంధించినా.. ఓర్పు, సహనంతో తట్టుకొని నిలబడ్డాడు జన సేనాని. 2019 ఎన్నికల్లో పోటీచేసిన 2 చోట్లా ఓడిపోయినా వెనకడుగు వేయలేదు… రాజకీయాల్లో నుంచి తప్పుకోలేదు… ఓర్చుకుంటూ.. నేర్చుకుంటూ… రాజకీయాలు తెలుసుకుంటూ నిలబడ్డాడు పవన్‌. వైసీపీ విమర్శలనే తన తన అస్త్రాలుగా మలచుకొని 2024 ఎన్నికల కదనరంగంలో గేమ్‌ చేంజర్‌గా మారాడు. 2024 ఎన్నికల్లో పవన్‌ది ఒకటే వ్యూహం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను.. వైసీపీని గద్దె దింపుతాం… (వీడియో). ఈ ఒక్కమాట ఏపీ రాజకీయాలను సమూలంగా మార్చేసింది.

2014 మార్చిలో తన పార్టీని స్థాపించిన పవన్‌ కల్యాణ్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లకుండా ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీకి మద్దతు పలికాడు. దీంతో టీడీపీ ఆ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే టీడీపీకి జనసేనకి కొన్ని పార్టీ పరమైన విబేధాలతో 2019లో ఒంటిరిగా పోటీ చేశాడు. ఆ ఎన్నిల్లో కేవలం ఒకే ఒక్కసీటును గెలిచింది జనసేన. ఆ తరవాత ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతుదారుడిగా మారాడు. అదే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్‌ ఒక్కచోటా గెలవలేదు. దీంతో ఆ ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చంది.

కొంతకాలం రాజకీయంగా నిశబ్దంగా ఉన్న పవన్‌.. ఇప్పటం గ్రామంలో రోడ్డు అభివృద్ది భాగంలో ఇళ్లు పోగొట్టుకున్న వారిని పవన్‌ పరామర్శించి ఆర్థికసాయం చేశాడు. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా రూ.లక్ష ఆర్థికసాయం చేశాడు. దీంతో వైసీపీ నేతలను పవన్‌పై వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడికి దిగారు. అయినా వెనుదిరగకుండా ప్రభుత్వ వ్యకతిరేక విధానలపై పోరాటాలు చేస్తూనే వచ్చారు పవన్‌. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్‌ సక్సెస్‌ అయ్యారు. తన ప్రసంగాల ద్వారా ప్రజల్ని ఆలోచింపజేశారు. గతుకుల రోడ్ల దగ్గరి నుంచి చెత్త పన్నులు, పెట్రోల్‌ ధరలు, వైసీపీ నాయకుల హత్యా రాజుకీయాల వరకు పవన్‌ తన గళాన్ని విప్పారు.

కట్‌ చేస్తే…సెప్టెంబర్‌ 9, 2023.. రాత్రి పది దాటింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ను రాష్ట్ర సరిహద్దుల్లోని గరికపాడు – అనుమంచిపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడం పవన్ కు మరింత మైలేజీ తెచ్చి పెట్టింది.

వైసీపీని అధికారానికి దూరం చేయాలన్న ఏకైక లక్ష్యంతో పని చేసిన పవన్‌ కల్యాణ్‌ దానికి తగ్గట్టుగానే తన రాజకీయ వ్యూహాలను అమలు చేశారు. సెప్టెంబర్‌ 14, 2023న రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. అంతేకాకుండా బీజేపీని కూడా ఒప్పించి కూటమిగా ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు. అయితే, పొత్తు ప్రకటన చేసిన పవన్‌ సామాజిక వర్గ పెద్దలు ముద్రగడ, హరిరామజోగయ్య లాంటి నేతల నుంచి ఒత్తిడినే ఎదుర్కొన్నారు. సగం సీట్లు కోరాలని ఒకరు అధికారాన్ని పంచుకోవడంపై కండీషన్లతో మరొకరు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు అనేకం చేశారు. అయితే, ఈ విషయంలో ఎవరి డిమాండ్లకు తలొగ్గకుండా పవన్‌ ముందుకెళ్లారు. బీజేపీని కూడా ఒప్పించి కూటమిలో భాగస్వామ్యం అయ్యేలా తన రాజకీయాన్ని నడిపారు. తద్వారా కూటమి ఏర్పాటు క్రెడిట్‌ మొత్తం పవన్‌కు దక్కింది. కూటమిని.. కూటమిని నిలబెట్టడం కోసం టీడీపీ కేటాయించిన 24 సీట్లలో 3 సీట్లను బీజేపీకి వదలుకున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు ఎదురైనా, నేతలు పార్టీని వీడినా పట్టించుకోకుండా జగన్‌ ఓటమే లక్ష్యంగా పావులు కదిపారు.

ఈ ఎన్నికల్లో పవన్‌ ఎక్కడా అతి విశ్వాసానికి పోకుండా తనకుంటూ బలమున్న స్థానాల్లోనే పోటీ చేసి తన రాజకీయ పరిపక్వతను ప్రదర్శించారు. 2019 ఎన్నికల్లో జనసేన మొత్తం 136 నియోజకవర్గాల్లో పోటీ చేయగా 120 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి 5.35% ఓట్లు సాధించింది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్‌ గతంలో చేసిన తప్పు ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించారు. కూటమి పార్టీ మధ్య సీట్ల పంపకాల్లో బలమున్న స్థానా విషయంలో వెనక్కి తగ్గకుండా జనసేనకు దక్కించుకోగలిగారు. దాని ఫలితంగానే 6.85% ఓట్లు సాధించి పోటీచేసిన 21 సీట్ల లోనూ పార్టీని గెలిపించుకోగలిగారు.

2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందిన పవన్‌కి ఆ ఎన్నికలు గొప్ప పాఠాలే నేర్పాయి. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో పవన్‌ కూడా చాలా తెలివిగా అడుగులు వేశారు. ఇక్కడే ఆయన రాజకీయంగా ఎంత పరిమితి చెందాడో అర్థం అవుతుంది. 2019లో ఒంటరిగా పోటీ చేసిన ఆయన పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోయి.. కేవలం ఒకేఒక్క సీటుకి పరిమితం అయ్యాడు. మరలా అదేవిధంగా ఒంటరిపోరుకు వెళితే అవే ఫలితాలు ఇంచుమించు రావొచ్చని.. అలా జరిగితే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరస్థితి వస్తుందనే ఆలోచనతో ఆ సారి చాలా తెలివిగా పొత్తుకు తెరలేపాడు. దీనిలో భాగంగానే టీడీపీతో పొత్తకు బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా పవనే అన్ని విషయాల్లో చొరవతీసుకొని పొత్తు కుదిర్చాడు. దీంతో కూటమిలో కీలకంగా మారాడు. దీని వల్ల తన పార్టీకి కలిసి వస్తుంది అలాగే తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీని కూడా ఓడించవచ్చనే ప్రణాళికతో ముందుకు వెళ్లి సక్సెస్‌ అయ్యాడు. దీంతో అనుకున్నట్లుగానే వైసీపీ ప్రతిపక్ష హోదా లేకుండానే అధికారం కోల్పోయింది.

పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిని వంగా గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రిని చేసి పంపుతా అని స్వయంగా జగన్‌ చెప్పినా అక్కడి ప్రజలు పవన్‌ కే పట్టంకట్టారు. ఏకంగా 70వేలకు పైగా మెజారిటీతో గెలిపించారు. ఓటమి నుంచి పిఠాపురంలో రికార్డు స్థాయి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యి.. అందరి మన్ననలు పొందాడు పవన్‌. ఎంత అంటే తమ వాహనాల మీద పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా.. ఏపీ ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా అనే అంతలా ప్రశంసలను అందుకున్నాడు. అయితే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి తన మార్క్‌ను చూపించిన పవన్‌ ఆ 5 ఏళ్ల పాలనలో రాజకీయ సంస్కరణలు చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

ఇవీ చదవండి: Akira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్‌
Deputy CM Pawan Kalyan: కొత్త రక్తం.. నవ్య పథం.. గతితప్పిన రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాడా?
Steps: అకాల మరణ ముప్పు తప్పించుకోవాలా? రోజూ మెట్లెక్కి దిగండి చాలు!
Hindu Population: దేశంలో తగ్గిపోతున్న హిందూ జనాభా.. పెరిగిన ఇతర మతాల సెన్సస్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు