HomeAndhra PradeshNagababu: పవన్ కల్యాణ్ పై నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు: నాగబాబు

Nagababu: పవన్ కల్యాణ్ పై నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు: నాగబాబు

Nagababu: పవన్‌ కల్యాణ్‌పై నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారని సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యానించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకున్నారన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తన సొంత డబ్బుతో సాయం అందించిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. మావాడు పవన్ కల్యాణ్ అని ప్రజలు భావించారని అన్నారు.

రాష్ట్ర క్యాబినెట్ లో కూడా జనసేన భాగస్వామ్యం అవుతుందన్నారు. పవన్ కల్యాణ్ మంత్రి పదవి అనేది తన పరిధిలో లేదన్నారు. తమ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు. వైసీపీ వాళ్లకు అధికారం అంటే హక్కుగా భావించారని, తాము రాజులం, ప్రజలు బానిసలుగా చూశారని విమర్శించారు. తమకు ప్రజలే రాజులు.. తాము సేవకులం అన్నారు. సినిమా అనేది ఒక పరిశ్రమ అని, రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి అవసరం సహకారం కోరతామన్నారు. వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు.

Read also: Accident: హిమాలయాల్లో ప్రమాదం.. ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురి దుర్మరణం
Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ సలహాదారుల రాజీనామాలు.. గవర్నర్ కీలక ఆదేశాలు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభంజనం.. ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీతో చంద్రబాబు హవా
Cancer Screening: ఏపీలో క్యాన్సర్ స్క్రీనింగ్ కు కార్యాచరణ
DGP: సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు: డీజీపీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు