Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలుపుతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అమరావతికి సమీపంలో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏర్పాట్లను టీడీపీ నేతలు, అమరావతి రైతులు పరిశీలించారు. రాయపూడి సమీపంలో పదవీ ప్రమాణ వేదిక ఏర్పాటు చేశారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు తాను నడుచుకుంటానని తెలిపారు. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, జగన్ స్వాగతించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ విస్పష్టంగా హోదాకు కట్టుబడి ఉన్నామని గతంలోనే పునరుద్ఘాటించారని గుర్తు చేశారు. ఇండియా కూటమిలో చంద్రబాబు చేరతారా? అన్న ప్రశ్నకు రేవంత్ రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానన్నారు.
Read Also: Nagababu: పవన్ కల్యాణ్ పై నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు: నాగబాబు
Accident: హిమాలయాల్లో ప్రమాదం.. ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురి దుర్మరణం
Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ సలహాదారుల రాజీనామాలు.. గవర్నర్ కీలక ఆదేశాలు
Contaminated food: మీకు తెలుసా? భారత్‌లో 527 రకాల ఆహారాలు కలుషితమవుతున్నాయట!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభంజనం.. ల్యాండ్ స్లైడ్ విక్టరీతో చంద్రబాబు హవా
