HomeLife StyleContaminated food: మీకు తెలుసా? భారత్‌లో 527 రకాల ఆహారాలు కలుషితమవుతున్నాయట!

Contaminated food: మీకు తెలుసా? భారత్‌లో 527 రకాల ఆహారాలు కలుషితమవుతున్నాయట!

Contaminated food: ఇటీవల కాలంలో కలుషిత ఆహారం ఎక్కువైపోతోంది. ముఖ్యంగా తినే తిండి విషయంలో బయటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసే వారి సంఖ్య పెరిగిపోవడంతో ఈ సమస్య మరింతగా వెలుగు చూస్తోంది. మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే తీసుకునే ఆహారమే కీలకం. మన బాడీకి సరైన పోషకాలు అందించకపోతే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. కానీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా కలుషిత ఆహారం తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రపంచ జనాభాను కలుషిత ఆహారం తీవ్రంగా బాధిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇండియాలో 527 రకాల ఆహారాలు కలుషితమవుతున్నాయని పలు నివేదికలు బహిర్గతం చేశాయి. ఆహారం కలుషితం కావడం అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? నివారణ చర్యలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆహార కలుషితం అంటే ఏమిటి?
ఆహార ఉత్పత్తుల్లోకి బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, రసాయనాలు లేదా టాక్సిన్స్ లాంటి హానికరమైనవి, జీవులు ప్రవేశిస్తే అవి కలుషితం అయినట్లు లెక్క. ప్రాసెసింగ్, రవాణా, స్టోరేజ్‌ వంటి ఏదో ఒక దశలో ఆహార ఉత్పత్తులు కలుషితానికి గురవుతున్నాయి. మనదేశంలో కలుషితమవుతున్న ఆహారాల జాబితాలో ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, సుగంధ ద్రవ్యాలు, ప్యాక్డ్ స్నాక్స్ లాంటివి అధికంగా ఉంటున్నాయి. ఈ ఫుడ్స్ వివిధ రోగ కారకాలు లేదా రసాయనాలతో కలుషితం అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తింటే అనారోగ్యం, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కారణాలు ఏమిటి?
ఇండియాలో ఆహారం కలుషితం కావడానికి అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి. పారిశుధ్యం సక్రమంగా లేకపోవడం, సరైన పరిశుభ్రత పద్దతులు అవలంబించకపోవడం, ఫుడ్ ప్రాసెసింగ్ విధానంలో లోపాలు, నిల్వ, రవాణా సమయంలో అప్రమత్తంగా లేకపోవడం అలాంటివి ప్రధాన కారణాలు. మరోవైపు పురుగు మందుల అధిక వినియోగం వల్ల కూడా ఆహార పదార్థాలు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎలాంటి సమస్యలు వస్తాయి?
కలుషిత ఫుడ్స్ తీసుకోవడం వల్ల అనేక రకాల రోగాలు వస్తాయి. కడుపులో అసౌకర్యం, వాంతులు, విరోచనాలు, జ్వరం లాంటివి వేధిస్తాయి. కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రమై చనిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల అధికంగా ప్రభావితం అవుతారు.

జాగ్రత్తలు ఇవీ..
ఆహారం తినే ముందు పండ్లు, కూరగాయలు లాంటి వాటిని శుభ్రంగా కడగాలి. హానికర బ్యాక్టీరియాను చంపడానికి మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్‌లను బాగా ఉడికించిన తర్వాతే వండుకోవాలి. పరిశుభ్రమైన పరిసరాల్లో ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోవాలి. పచ్చి లేదా సరిగా వండని ఆహారాలను తీసుకోకపోవడమే ఉత్తమం. ప్యాకింగ్ చేసినవి, లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కొనుగోలు చేసే సమయంలో లేబుల్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య అధికారులు సూచించిన ఆహార భద్రత నియమాలను తప్పక అనుసరించాలి.

ఇక ఆహార భద్రతతో పాటు కలుషిత ఆహారాన్ని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది కూడా కీలక పాత్ర. ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్, పంపిణీ లాంటి ప్రక్రియల్లో కఠినమైన నిబంధనలు, ప్రమాణాలను తప్పకుండా పాటించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆహార భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి ఆహార సంస్థలను రెగ్యులర్ గా సోదాలు చేస్తుండాలి. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటూ ఉండాలి.

ఇవీ చదవండి: Child Care: చిన్నారుల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపాలి?
Sabja Ginjalu: పరగడుపున సబ్జా గింజలతో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పదిలం!
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్
Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు