DGP: సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని తెలిపారు.
అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాంటి పోస్టులు ఎవరి ప్రోద్బలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామనీ, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఆ తరహా పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధమని సూచించారు. గ్రూప్ అడ్మిన్ లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని డీజీపీ హితవు పలికారు.
Read Also: AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకరణ
DGP Disk Awards: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఏపీ డీజీపీ డిస్క్ అవార్డులు
Palnadu Review: పల్నాడులో గణనీయంగా తగ్గిన నేరాలు.. సమీక్షలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
DGP on punganuru incident: పుంగనూరు ఘటనలో ఇప్పటి వరకు 80 మందిని అరెస్టు చేశాం : డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
