What is Election Code: దేశ వ్యాప్తంగా పలు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వచ్చే నెల జూన్ 4వ తేదీ వరకు అమలులో ఉంటుంది. అయితే, ఎన్నికల కోడ్ అంటే చాలా మందికి తెలియదు. ఈ కథనంలో ఎన్నికల కోడ్ అంటే ఏమిటి? ఇది అమల్లోకి వస్తే ఏయే అంశాలపై నిషేధం ఉంటుందన్న విషయాలు తెలుసుకుందాం.
చరిత్ర ఏంటంటే..
1960 ఏడాదిలో కేరళ రాష్ట్ర శాసనభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు తొలిసారిగా ఎన్నికల నియమావళి అన్నది అమలులోకి తెచ్చారు. అదే సమయంలో అధికారులు.. రాజకీయ పార్టీలకు ఒక నియమావళిని పాటించేలా నిబంధనలు తెచ్చేందుకు ప్రయత్నించాయి. అప్పటి నుంచి ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఎన్నికల కోడ్ అన్నది అమలు చేస్తున్నారు. రకరకాల మార్పులతో ఎన్నికల కోడ్ అన్నది ప్రస్తుతం చాలా కీలకంగా మారింది.
కోడ్ అమలులో ఉంటే ఏమవుతుంది?
ఎలక్షన్ కోడ్ అన్నది కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఒక ప్రత్యేకమైన నియమావళి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ తప్పనిసరిగా పాటించాలి. ఎన్నికల ప్రచార సభలు, ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించే సందర్భాల్లో వారు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడానికి వీల్లేదు. ఎవరైనా ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించినట్లు ఎన్నికల సంఘం భావించినట్లయితే తొలిసారి హెచ్చరికలు జారీ చేస్తుంది. లేదా ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేస్తుంది. సదరు పార్టీపై, అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ రాయించే అవకాశం ఉంటుంది. దీని వల్ల పార్టీలు, అభ్యర్థులంతా ఎన్నికల కోడ్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందే. అలాగే ప్రభుత్వాలు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కాలంలో కొత్త పథకాలు ప్రకటించకూడదు. అలాగే అధికారంలో ఉన్న పార్టీలు.. తమ అధికారాన్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదు.
ఇందుకు ఉదాహరణగా ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించరాదు. స్టార్ క్యాంపెయినర్లకు ప్రత్యేక నియమాలను రూపొందించారు. వాటిని వారు అనివార్యంగా పాటించాల్సిందే.
ఎలాంటి వాటిపై నిషేధం ఉంటుందంటే..
* ఎన్నికల ప్రక్రియను ప్రకటించడం వల్ల అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు, ఆర్థిక గ్రాంట్లు లాంటివి ప్రకటించడం చేయరాదు. వాగ్దానాలు చేయడం కూడా నిషేధం.
* లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో పౌర సేవకులు మినహా శంకుస్థాపనలు లేదా ఏ రకమైన ప్రాజెక్టులు లేదా పథకాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రికి, మంత్రులకు అవకాశం లేదు.
* అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు ఏ ప్రాజెక్టూ లేదా పథకాన్ని కొత్తగా ప్రకటించరాదు. ప్రచార ప్రయోజనాల కోసం మంత్రులు అధికారిక యంత్రాంగాన్ని వినియోగించడానికి వీల్లేదు.
* ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ అధికారిక సందర్శనలు, ఎలాంటి ఎన్నికల కార్యకలాపాలతో కలిపి ఉండరాదు. ఎన్నికల ప్రయోజనాల కోసం అధికారిక యంత్రాంగం లేదా సిబ్బందిని వాడటంపై నిషేధం.
* మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు తమ విచక్షణను ఉపయోగించి గ్రాంట్లు, చెల్లింపులూ ఇవ్వడానికి వీల్లేదు.
* అధికారిక యంత్రాంగాన్ని వ్యక్తిగత, ఎన్నికల ప్రచారం కోసం వినియోగించడానికి వీల్లేదు.
* ప్రభుత్వ బిల్డింగులను ఎన్నికల ప్రచారం నిమిత్తం వాడుకోరాదు. అక్కడ ప్రచారానికి సంబంధించిన బహిరంగ సభలు నిర్వహించరాదు.
* దినపత్రికలు, టెలివిజన్ ఛానళ్ల లాంటి వాటిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఇవ్వరాదు.
ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ్ మొబైల్ యాప్ తీసుకొచ్చిన ఈసీ
EC Serious: పేరులేని రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
Election Day: ఏపీలో ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవు
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ
