Andhra Pradesh: ఏపీలో ఓటరు పోటెత్తాడు. ఉదయం 6 గంటల నుంచే ఓటు వేసేందుకు క్యూలైన్లలో జనం తండోపతండాలుగా వచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి సుమారు 70 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు ఏరియాలోనూ వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపేంతగా పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో మారిపోయాయి.
అటువైపున ఏపీలో పోలింగ్ పరిస్థితులపై టీడీపీ అనుకూల మీడియా మాత్రం వైసీపీ వాళ్లు టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని టీవీల్లో హోరెత్తించారు. మరోవైపున ఇటు వైసీపీ అనుకూలంగా వ్యవహరించే మీడియాది కూడా ఇదే తీరు. టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. మొత్తంగా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలని టీవీ చానళ్లు ప్రయత్నించినా సరే.. అటు అర్బన్‌లోనూ, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడా ఓటర్లు వెనకడుగు వేయలేదు. ధైర్యంగా అంతకంతకూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఎవరికి మేలు చేస్తుంది?
ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు దీనిపై స్పందిస్తూ ఓటింగ్ పెరగడం తమకే కలిసి వస్తుందని చెబుతున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ శాతం పెరగడం మాత్రం జగన్‌వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇవీ చదవండి: YS Jagan in Ichapuram: మీరు వేసే ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదులుతుంది: ఇచ్చాపురంలో సీఎం జగన్
SAMARTH APP: క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ్ మొబైల్ యాప్ తీసుకొచ్చిన ఈసీ
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
YS Jagan in Narasapuram: జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, బాబుకు ఓటేస్తే ముగింపే.. నరసాపురంలో సీఎం జగన్
YSRCP: చంద్రబాబుకు ఓటు వేయడం అంటే చీకటి రోజులను మళ్లీ తెచ్చుకోవడమే: సజ్జల
