Blood donation: చాలా మందికి రక్తదానం చేయడం అలవాటుగా మారి ఉంటుంది. ఏటా క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తుంటారు. రక్తదానం అనేది ప్రతీ ఒక్కరూ వారి జీవితంలో చేయాలని, ఇది సామాజిక బాధ్యత అని పెద్దలు చెబుతున్నారు. ఏవరికైనా రక్తం అవసరమైనప్పుడు సరైన సమయంలో అందకపోవడంతో చాలా మంది వారి ప్రాణాలు పోతుంటాయి.
రక్తదానంపై ఎప్పటికప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలాసార్లు ప్రజలకు అవగాహన చేకూరుస్తున్నాయి. మన దేశంలో ప్రతి సంవత్సరం కేవలం 10 శాతం మంది మాత్రమే రక్తందానం చేయడానికి ముందుకు వస్తున్నారట. రక్తదానం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, శరీరం బలహీనంగా తయారవుతుందని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ అందులో నిజం లేదు. వాస్తవానికి రక్తదానం చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని వైద్యులు చెబుతున్నారు.
బ్లడ్ డొనేషన్ వల్ల ఐరన్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. దీంతోపాటు రక్తంలో ఎక్కువగా ఉండే ఐరన్.. రక్త ధమనులను అడ్డుకుంటుంది. ఈ దెబ్బతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉండడంతో హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుంది. రక్తదానం చేయడం ద్వారా రక్తంలోని ఐరన్ నిల్వలు తగ్గుతాయన్నది తెలిసిందే. ఈ కారణంగా ధమనులు బేషుగ్గా పని చేస్తాయి. ఇలా గుండెకి ప్రమాదం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తప్పుతుంది..
వాస్తవానికి రక్తంలో ఐరన్ అనేది కొందరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో వారికి క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తరచూ రక్త దానం చేయడం వల్ల శరీరంలోని రక్తంలో ఐరన్ స్థాయిలు తగ్గి, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రభావం తగ్గిపోతుంది. రక్తదానం చేయడం ద్వారా బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది.
మన శరీరంలో వివిధ రకాల వ్యాధులను నివారించేందుకు రోగ నిరోధక శక్తి అవసరం. ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి, కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు మన బాడీలో సరిపడినంత రోగ నిరోధక శక్తి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు రక్త దానం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి వ్యవస్థను మెరుగుపర్చుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Blood facts: మనిషి ఒకసారి ఎంత రక్తదానం చేయాలి? స్త్రీ, పురుషుల్లో ఎంత రక్తం ఉండాలి?
Blood sugar: రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ఎలా? కార్బోహైడ్రేట్లను పరిమితం చేస్తే ఉపయోగాలు ఇవీ..
Blood: ఏ వయసు వారిలో ఎంత రక్తం ఉండాలి? తక్కువ ఉంటే ఏం చేయాలి?
Ramadan: రంజాన్ ఉపవాస కాలం ఏమిటి? ప్రత్యేకతలు.. ప్రాశస్తం ఏమిటంటే..!
Jaundice: పచ్చ కామెర్ల లక్షణాలు ఏంటి? మద్యం అతిగా తాగితే జాండీస్ వస్తాయా?
